మహేష్ పై నాగవంశీ ట్వీట్ కు అర్థమేంటీ..

గుంటూరు కారం సినిమాపై మొదటి నుంచి సందిగ్ధం ఉంది. ఈ సినిమా మొదలైన దగ్గర్నుంచి ఏ దశలోనూ ఆశాజనకంగా అనిపించలేదు. కథ మారింది. షెడ్యూల్స్ మారాయి. టెక్నీషియన్స్ మారిపోయారు. ఆర్టిస్టులు సైతం మారారు.అటు మహేష్ బాబు మాత్రం అస్సలేం పట్టనట్టుగా ఉండిపోయాడు.

పైగా ఈ షూటింగ్ వదిలేసి వెకేషన్స్ కు వెళ్లాడు. అలా ఒకటి రెండు కాదు.. నాలుగైదు సార్లు గుంటూరు కారం షూటింగ్ కు రెడీగా ఉన్నా అతను మాత్రం అవేం పట్టించుకోలేదు. ఈ కారణంగానే కొన్నాళ్లుగా ఆయనపై చాలా విమర్శలు కూడా వస్తున్నాయి.గత నెలలో కూడా లాంగ్ వెకేషన్ కు వెళ్లాడు.

వచ్చిన వెంటనే ఈ నెల 16 నుంచి సెట్స్ లో అడుగుపెడతాడు అనుకున్నారు. బట్ అతను రాలేదు. దీనికి తోడు సినిమాను కాదని ఓ యాడ్ ఫిల్మ్ కు సంబంధించిన ప్రెస్ మీట్ కు అటెండ్ అయ్యాడు. ఈ ప్రెస్ మీట్ లో ఖచ్చితంగా తనకు గుంటూరు కారం నుంచి ప్రశ్నలు వస్తాయని తెలుసు. అందుకే ఆన్సర్ సిద్ధంగా పెట్టుకున్నాడు.


అంతా ఊహించినట్టుగానే గుంటూరు కారం రిలీజ్ గురించి అడిగారు. దీనికి మహేష్ బాబు చాలా స్పష్టంగా, ఖచ్చితంగా సంక్రాంతికి వస్తుందని చెప్పాడు. సంక్రాంతికి వస్తుంది.. మీ అందరికీ సంతోషం ఇస్తుందని కూడా చెప్పాడు.ఈ మాటలను నిర్మాత నాగవంశీ కూడా ట్వీట్ చేశాడు.

దీంతో ఓ క్లారిటీ వచ్చిందని చెప్పాడా లేక ఈ మాటలు గుర్తు పెట్టుకోండని చెప్పాడా అని కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు.నిజంగానే నిర్మాణ సంస్థ హీరో తీరుతో ఇబ్బంది పడింది. అందుకే ఈ డేట్ ను గుర్తు పెట్టుకోమని అభిమానులకు చెబుతున్నట్టుగానే చాలామంది భావిస్తున్నారు. ఒకవేళ ఆ టైమ్ కు రిలీజ్ చేయలేకపోతే ఆ ప్రాబ్లమ్ మాది కాదు అనేందుకు కూడా ఈ ట్వీట్ ఉపయోగపడుతుంది. బట్ అంత వరకూ రాకుండానే సినిమా అనుకున్నట్టుగా సంక్రాంతికే వస్తుందనే ఆశావాదంతోనే అనుకుంటే సరిపోతుంది.

Related Posts