ఎన్టీఆర్ దేవరపై బిగ్ అప్డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న దేవర సినిమాపై భారీ అంచనాలున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా సౌత్ స్క్రీన్ కు పరిచయం అవుతున్న సినిమా ఇది. అలాగే ఫస్ట్ టైమ్ సైఫ్‌ అలీఖాన్ ఓ తెలుగు సినిమా చేస్తున్నాడు. అతనే మెయిన్ విలన్ ఈ చిత్రంలో. సైఫ్‌ గెటప్ స్పెషల్ గా ఉంటుందని చెబుతున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ మూవీ కోసం ముందుగాయాక్షన్ ఎపిసోడ్స్ ను షూటింగ్ చేశాడు కొరటాల శివ.

అవన్నీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ తో కూడినవి కావడంతో.. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కోసం కావాల్సినంత టైమ్ ఉంటుంది. ఏదైనా తేడా వస్తే ఇమ్మీడియొట్ గా రీ షూట్ అయినా పెట్టుకోవచ్చు. అప్పుడు కూడా సరిపోయేంత టైమ్ ఉంటుంది.దీనికోసం షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాన్ స్టాప్ గా కేవలం ఫైట్స్ మాత్రమే షూటింగ్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ఆ పోర్షన్ పూర్తయిందని సమాచారం. జూన్ నెలలోనే రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను ఏ మాత్రం గ్యాప్ లేకుండా చిత్రీకరించారట. దీంతో యాక్షన్ పార్ట్ పూర్తయిందని టాక్. సో.. ఇక టాకీ స్టార్ట్ కాబోతోంది.


ప్రస్తుతం వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఆగస్ట్ 15 తర్వాత నుంచి టాకీ పార్ట్ స్టార్ట్ అవుతుందట. అప్పుడే హీరోయిన్ తో పాటు ఇతర కాస్టింగ్ ఎంట్రీ కూడా ఉంటుంది. అలాగే నవంబర్, లేదా డిసెంబర్ వరకూ పాటలు కూడా ఫినిష్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. అలా జరిగితే ఏప్రిల్ 5న విడుదలయ్యే దేవరకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా హ్యాపీగా దేశవ్యాప్తంగా మంచి ప్రమోషన్స్ కూడా చేసుకుని మరీ బరిలోకి దిగొచ్చు. ఎన్టీఆర్ కు ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తోన్న సినిమా కాబట్టి చాలా ప్రిస్టీజియస్ గా చూస్తున్నారు. మరి ఆర్ఆర్ఆర్ ఇమేజ్ ను దేవర కంటిన్యూ చేస్తుందా లేదా అనేది చూడాలి.

Related Posts