బ్రో టీమ్ టూర్ షెడ్యూల్ ఇదే

పవన్ కళ్యాణ్‌, సాయితేజ్ కలిసి నటించిన బ్రో మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా.. కలెక్షన్స్ మాత్రం అదిరిపోతున్నాయి. అందుకు ప్రధాన కారణం ఈ చిత్రానికి పోటీ లేకపోవడమే. బ్రో కు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఉంటే బేబీ చిత్రానికి ఇంకా కలెక్షన్స్ వస్తూ ఉండేవి కాదు అనేది నిజం. టాక్ బలంగా లేకపోయినా కలెక్షన్స్ విషయంలో కాంప్రమైజ్ కావొద్దని.. టూర్ కు ప్లాన్ చేసింది టీమ్. ఈ టూర్ ద్వారా తమ చిత్రాన్ని తమ కోణంలో ఎక్స్ ప్లెయిన్ చేయడంతో పాటు 100 కోట్లు టార్గెట్ ను రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నట్టు టాక్. మొత్తం మూడు రోజుల టూర్ కు ఏర్పాట్లు చేసుకుంది మూవీ టీమ్.

మొదటి రోజు
ఉదయం 9 గంటలకు విజయవాడ కనకదుర్గ టెంపుల్ ను విజిట్ చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు తెనాలిలో థియేటర్ కు వెళతారు. అక్కడి నుంచి 1.30గంటలకు గుంటూరు థియేటర్ కవరేజ్ ఉంటుంది. సాయంత్రం 4.30 గంటలకు విజయవాడలోని థియేటర్ ను సందర్శిస్తారు. సాయంత్రం 6 గంటలకు పివిపి మాల్ లో ఓ పెద్ద ఈవెంట్ ను ప్లాన్ చేసుకున్నారు.

రెండో రోజు
ఉదయం 10 గంటలకు ద్వారకా తిరుమల ఆలయ సందర్శనం ఉంటుంది. 11 గంటలక మద్ది ఆంజనేయ స్వామి టెంపుల్ కు వెళతారు. మధ్యాహ్నం 1.00 గంటకు ఏలూరులోని థియేటర్ లేదా ఏదైనా కాలేజ్ ను సందర్శించేలా ప్లాన్ చేస్తున్నారు. సాయంత్రం 5.00గంటలకు భీమవరం కాలేజ్ లో స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ ఉంటుంది. భీమవరంలోనే 7 గంటలకు థియేటర్ ను సందర్శించి ప్రేక్షకులతో కలిసి సందడి చేయబోతున్నారు.

మూడవ రోజు
మధ్యాహ్నం 12 గంటలకు అమలాపురం థియేటర్ విజిట్ ఉంటుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు కాకినాడ థియేటర్ కు వెళతారు. సాయంత్రం 5.30గంటలకు రాజమండ్రిలో ఈవెంట్ ప్లాన్ చేసుకున్నారు.
ఇలా మొత్తం మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ఏరియాలు కవర్ అయ్యేలా ప్లాన్ చేశారు.అయితే ఈ మూడు రోజులూ పవన్ కళ్యాణ్‌ కూడా టీమ్ తో ఉంటాడా.. లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. దీంతో పాటు టీమ్ లో ఎవరెవరు ఉండబోతున్నారు అనేది కూడా తేలాలి. మొత్తంగా ఈ వీక్ డేస్ లో మరిన్ని కలెక్షన్స్ సాధించేందుకే ఈ టూర్ ముఖ్య ఉద్దేశ్యం అని తెలుస్తోంది.

Related Posts