మెలోడియస్ గా గాండీవధారి సాంగ్

వరుణ్‌ తేజ్, సాక్షి వైద్య జంటగా ప్రవీణ్‌ సత్తారు డైరెక్ట్ చేసిన సినిమా గాండీవధారి అర్జున. స్పై థ్రిల్లర్ గా వస్తోన్న ఈచిత్రం నుంచి లేటెస్ట్ గా ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ఇంతకు ముందు విడుదల చేసిన ప్రోమోతోనే ఆకట్టుకున్న ఈ టీమ్ పూర్తి పాటతో మరింత మెప్పించింది. ” నీ జతై సాగింది పాదమే.. ఆపినా ఆగునా.. లోలోని వేగమే..” అంటూ సాగే ఈ గీతాన్ని రెహ్మాన్ రాశాడు.

ఎలియా, నకుల్ అభ్యంకర్ ఆలపించారు. ఇలాంటి మెలోడీస్ చేయడంలో ఎప్పటి నుంచో ది బెస్ట్ అనిపించుకున్న మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. వినగానే ఆకట్టుకునేలా కాక వింటూన్న కొద్దీ ప్రేమలో పడేలా ఉందీ సాంగ్. ట్యూన్ చాలా చాలా బావుంది. ఆర్కెస్ట్రైజేషన్ కొత్తగా ఉంది. మినిమం ఆర్కెస్ట్రాతో మాగ్జిమం మెలోడీకి ప్రయత్నించాడు మిక్కీ. అందుకే ఇది కొన్నాళ్ల పాటు యూత్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునే అవకాశం ఉన్న పాటలా అనిపిస్తోంది. ముఖ్యంగా డ్యూయొట్ మిక్స్ అయిపోవడం పాటకు మరింత అందాన్ని తెచ్చింది. “ఎదుట నువ్వు ఉంటే ఎదకు రెక్కలొచ్చే.. ప్రపంచాన్ని దాటుతూ నింగి మీటుతూ అలా..” అంటూ మంచి సాహిత్యం కూడా కనిపిస్తోంది.


ఇక ఈ పాట చూస్తోంటేనే సినిమాటోగ్రఫీ ఎంత బావుండబోతోందో అర్థం అవుతుంది. ప్రవీణ్‌ సత్తారు నుంచి యాక్షన్ ఎంటర్టైనర్ అంటే అది ఆల్ట్రా స్టైలిష్‌ గా ఉంటుందని ఆల్రెడీ నిరూపించుకున్నాడు. ఇదీ అలాగే ఉండబోతోందని ఆ మధ్య వచ్చిన టీజర్ తో చెప్పకనే చెప్పాడు. ఇక సినిమాను ఆగస్ట్ 25న విడుదల చేయబోతున్నారు. ఇలాంటి సినిమాల్లో పాటలకు పెద్దగా స్పేస్ ఉండదు. అయినా ఈ పాట ఎందుకు ఉందీ అంటే ఇందులో హీరో హీరోయిన్ కలిసే ఓ మిషన్ లో భాగస్వామ్యం అవుతారు. అంటే ప్రేమలోనూ పడ్డారు అనుకోవచ్చు. మొత్తంగా గాండీవధారి అర్జునకు ఈ పాట ఓ మెలోడియస్ రైడ్ గా మిగులుతుందని చెప్పొచ్చు.

Related Posts