షారుఖ్ ఖాన్ గురించి ఈ సంచలన విషయం తెలుసా

షారుఖ్ ఖాన్.. ప్రస్తుతం జవాన్ సినిమాతో దేశాన్ని.. ఆ మాటకొస్తే అన్ని దేశాల్లో ఉన్న ఇండియన్స్ ను ఊపేస్తున్నాడు. జవాన్ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన అన్ని చోట్లా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతోంది. తెలుగులోనే ఫస్ట్ 9 కోట్లకు పైగా వసూళ్లయ్యాయి అంటే ఆ మూవీ మేనియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు ఇప్పటి వరకూ ఏ బాలీవుడ్ హీరోకైనా ఇదే హయ్యొస్ట్ ఓపెనింగ్. అంటే షారుఖ్ తెలుగులోనూ బాద్ షానే. ఈ విజయానికి ముందు అతను పఠాన్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. బట్ ఈ మూవీ కంటెంట్ తో పోలిస్తే ఇది బలంగా ఉంది. కథ, కథనాలు స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఎలివేషన్స్ ఓ రేంజ్ లోఉన్నాయి. అందుకే ఫ్యాన్స్ తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా జవాన్ కు జై కొడుతున్నారు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్ బాద్ షా అనిపించుకున్న షారుఖ్ ఖాన్ గురించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం చాలామందికి తెలియదు. అది తెలిస్తే అతను నిజంగా పఠాన్ అనుకుంటారు.


ఇప్పుడంటే బాలీవుడ్ ను సౌత్ డామినేట్ చేసింది. చేస్తూనే ఉంది. దాన్ని దాటేందుకు వాళ్లు తంటాలు పడుతున్నారు. బట్ ఒకప్పుడు.. అంటే 90స్ లో బాలీవుడ్ ను శాసించింది మాఫియా.. అండర్ వరల్డ్. ఈ గ్యాంగ్ స్టర్స్ దెబ్బకు బాలీవుడ్ విలవిలలాడింది. వాళ్లు ఏం చెబితే అదే చేయాలి. కాంబినేషన్స్ నుంచి డైరెక్టర్ వకరూ అండర్ వరల్డ్ నుంచే ఆదేశాలు వచ్చాయి.

ఇటు సినిమా నటులు కూడా అంతే వారు ఏం చెబితే అదే చేయాలి. అలా చేసి బలైపోయిన ఎంతోమంది స్టార్స్ చూశారు అప్పటి ప్రేక్షకులు. ఇక హీరోయిన్లైతే చెప్పక్కర్లేదు. కొందరు కెరీర్ కోసం కాంప్రమైజ్ అయ్యారు. చాలా తక్కువ మందితప్పుకున్నారు. అలాంటి టైమ్ లో షారుఖ్ ఖాన్ ను కూడా తమ కోసం పనిచేయాలని అండర్ వరల్డ్ ఒత్తిడి తెచ్చింది. అప్పటికే చాలామంది హీరోలు ఆ మాఫియాకు సరెండర్ అయ్యాడు. బట్ ఒకే ఒక్కడు షారుఖ్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ” నన్ను కాల్చేస్తే చచ్చిపోతానేమో.. కానీ మీ కోసం మాత్రం ఎప్పటికీ పనిచేయను. నేను పఠాన్ ను.. ” అని చెప్పాడు.

ఈ వార్త అప్పట్లో ఓ పెద్ద సంచలనం. బాలీవుడ్ ను శాసిస్తున్న మాఫియా బెదిరింపులకు లొంగని హీరోగా షారుఖ్ ధైర్యంగా కీర్తించేవారు కూడా లేకపోయినా కొందరు మాత్రం పతాక శీర్షికల్లో చెప్పుకున్నారు. అంతటి దమ్ము ఉంది షారు ఖాన్ లో. దాదాపు దశాబ్ద కాలంగా ఓ బ్లాక్ బస్టర్ కోసం స్ట్రగుల్ అవుతూ ఒకే యేడాది రెండు బ్లాక్ బస్టర్స్ అందుకుని రికార్డులు క్రియేట్ చేస్తోన్న బాద్ షాను చూస్తూ కొందరు సీనియర్ ఫ్యాన్స్ మరోసారి ఆ విషయాలను ఇప్పుడు గుర్తుకు చేసుకుంటుడటం విశేషం.

Related Posts