ఒకేసారి ముగ్గురిని ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్

బిగ్ బాస్ సీజన్ 7 గత రెండు సీజన్స్ కంటే బెటర్ గా స్టార్ట్ అయింది.. రన్ అవుతోంది కూడా. టాస్క్ లు, ఫైట్లు, గొడవలు, లవ్ ట్రాకులు అబ్బో ఇవన్నీ చాలా త్వరగా స్టార్ట్ అయ్యాయి. ఒకరిని మించి ఒకరు అప్పుడే అప్పర్ హ్యాండ్ కోసం మొదటి రోజు నుంచే నానా తంటాలు పడుతున్నారు. పవన్ అస్త్రం కోసం పోటీ మామూలుగా లేదు. మొత్తంగా మొదటి రోజు నుంచే హాట్ గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్ కు వచ్చింది. శనివారం రోజు ఫన్ తో ముగించిన బిగ్ బాస్ ఎలిమినేషన్ రౌండ్ పూర్తి చేశాడు. ఇందులో ఎనిమిందిమందిని ఎలిమినేషన్ జాబితాలో ఉంచాడు.


ఇక ఈ రోజు ప్రసారం కాబోతున్న ఎపిసోడో ప్రోమో చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఒకేసారి ముగ్గురిని ఎలిమినేట్ చేసినట్టుగా ఈ ప్రోమోలో ఉంది. ఇది నిజమా కాదా అనేదిఅప్పుడే చెప్పలేం. కానీ ప్రోమో చూస్తే నమ్మడానికి దగ్గరగా ఉంది. సండే అంటే ఫన్ డే అంటూ మొదలైన ప్రోమో చివరికి వచ్చే సరికి ఎలిమినేషన్ రౌండ్ లో ఉన్న 8 మందికి తలో కెఫిన్ బాక్స్(శవపేటిక)ఇచ్చాడు. అందులో అస్తి పంజరం ఉన్నవాళ్లు సేఫ్ కాదని, ఫ్లవర్స్ ఉన్నవాళ్లు సేఫ్ అని చెప్పాడు. అలా రతిక, దామినితో పాటు డాక్టర్ గౌతమ్ కిషన్ బాక్స్ ల్లో అస్తిపంజరం ఉంది. దీంతో మీరు ఎలిమినేటెడ్ అనేశాడు నాగార్జున.

అంతే అంతా షాక్.. నిజంగా వారిని ఎలిమినేట్ చేస్తారా లేదా అనేది ఇవాళ్టి ఎపిసోడ్ లో తెలుస్తుంది. మొత్తంగా ఈ ప్రోమో నిజమే అయితే మాత్రం ఈ సారి బిగ్ బాస్ మామూలుగా ఉండదు అనే వార్నింగ్ హౌస్ మేట్స్ అందరికీ ఇచ్చినట్టే. విశేషం ఏంటంటే.. ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుందనుకున్న కిరణ్ రాథోడ్ ఇందులో లేదు.

Related Posts