ప్రభాస్ సంచలన నిర్ణయం

ప్యాన్ ఇండియన్ సూపర్ స్టార్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతోన్న ప్రభాస్.. తాజాగా మంచు విష్ణు సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాడు. కాస్త ఆశ్చర్యంగా ఉన్నా మంచు విష్ణు ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేసిన భక్త కన్నప్ప చిత్రంలో నటించబోతున్నాడు విష్ణు. ఈ మేరకు విష్ణు తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో అఫీషియల్ గా ప్రకటించాడు. అయితే ప్రభాస్ టీమ్ నుంచి ఎలాంటి ప్రకటన లేదు. కానీ ప్రభాస్ లాంటి టాప్ స్టార్ గురించి ఆయన పర్మిషన్ లేకుండా ఏ హీరో ఇలా ప్రకటించడు కదా.. అందుకే ఈ వార్త నిజమే అనుకోవచ్చు.


ఇక భక్త కన్నప్ప చిత్రాన్ని ప్రభాస్ తోనే తీయాలనే కోరిక ఉండేది ఆయన పెదనాన్న కృష్ణం రాజు కు ఉండేది. ఈ మేరకు తనే ఈ చిత్రాన్ని నిర్మిస్తా అని కూడా చెబుతూ వచ్చాడు. ఈలోగానే ఆయన కన్నుమూశాడు. విశేషం ఏంటంటే.. ఆయన బ్రతికి ఉన్నప్పుడే విష్ణు తను కూడా ఈ భక్త కన్నప్ప చిత్రాన్ని రూపొందిస్తానని చెప్పాడు. మరోవైపు .. భక్త కన్నప్ప చిత్రంతో తనలోని నటుడుని మరో కోణంలో ఆవిష్కరించుకున్నాడు కృష్ణంరాజు. భక్త కన్నప్ప ఆయన కెరీర్ లోనే ఒక బెస్ట్ మూవీగా నిలిచింది. అందుకే ప్రభాస్ తో మరోసారి రూపొందించాలనుకున్నాడు. కుదర్లేదు.


అలాంటి సినిమాను విష్ణు తీస్తుండటం వల్ల పెదనాన్న కోరిక నెరవేరినట్టూ ఉంటుందనుకున్నాడేమో.. ప్రభాస్ ఈ మూవీలో భాగస్వామ్యం అయ్యాడు అంటున్నారు. అయితే ప్రభాస్ నుంచి ఈ న్యూస్ అఫీషియల్ గా రావాల్సి ఉంది. ఒకవేళ నటిస్తే ఆయన శివుడు పాత్రలో కనిపించే అవకాశం ఉందంటున్నారు. ప్రభాస్ ను రాముడుగా జనం యాక్సెప్ట్ చేయలేకపోయాడు. మరి శివుడుగా అంగీకరిస్తారా..?

Related Posts