మళ్లీ అందరికీ టార్గెట్ అయిన ఎన్టీఆర్..

మాజీ ముఖ్యమంత్రి, ఏపి ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేస్ లో ఆయన్ని ఏపి సిఐడీ పోలీస్ లు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలంగా ఉంది. వేలాదిగా కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. అటు తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ పోలీస్ లు హౌస్ అరెస్ట్ లు చేశారు. ఇటు చంద్రబాబు కుటుంబం మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇది అక్రమ అరెస్ట్ అనీ అందరూ ఖండిస్తున్నారు.


కానీ ఎప్పట్లానే ఎన్టీఆర్ నుంచి ఒక్క ప్రకటనా రాలేదు. ఇది పూర్తిగా రాజకీయ వ్యవహారం. అందుకే వద్దనుకున్నాడో లేక అందరూ అనుకుంటున్నట్టుగా చంద్రబాబుకు, ఆయనకు మధ్య గ్యాప్ ఉందో కానీ.. ఇప్పుడు ఓ కుటుంబ సభ్యుడుగా ఆయన కూడా స్పందిస్తే బావుంటుంది అనేది చాలామంది భావన. అతని భావనలు ఎలా ఉన్నా.. ఇది కష్ట కాలం. అందుకే స్పందించాలి అంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు.
మరికొందరు ఎప్పట్లానే అతను వైసీపీకి అనుకూలం.. అందుకే స్పందించడం లేదు అంటే పాత మాటలే మళ్లీ చెబుతున్నారు. నిజానికి చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబం చాలాకాలంగా ఎన్టీఆర్ దూరం పెట్టింది. పైకి ఎలా కనిపించినా వారి మధ్య సన్నిహిత సంబంధాలు చెడిపోయాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంతకు ముందు కూడా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు విజయవాడలో జరిగినప్పుడు ఎన్టీఆర్ వెళ్లలేదు. ఆ ఉత్సవాలు హైదరాబాద్ లో నిర్వహించినప్పుడూ వెళ్లలేదు. అప్పుడూ అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు ఎన్టీఆర్.


ఇక చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిపై కొందరు వైసీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించాడు. కానీ ఆ స్పందనను కూడా తప్పు పట్టారు టిడిపి శ్రేణులు. ఇక ఇప్పుడు మరోసారి వారికి ప్రధాన టార్గెట్ గా మారాడు. ఇలాంటి వ్యక్తి టిడిపిని కాపాడతాడా అంటూ మరోసారి జూనియర్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. మరి ఇకనైనా యంగ్ టైగర్ స్పందిస్తాడా లేక ఈ పొలిటికల్ మేటర్ కు దూరంగా ఉంటాడా అనేది చూడాలి.

Related Posts