మా నాన్నకి పెళ్లి రీమేక్ లో చిరంజీవి

డబ్బింగ్ రూపంలో తెలుగులో వచ్చిన సినిమాలనే మళ్లీ రీమేక్ చేస్తున్నారు మన హీరోలు. అందులోమెగా హీరోలు మరీ ముందున్నారు అని చెప్పొచ్చు. ఆ మధ్య పవన్ కళ్యాణ్‌ కాటమరాయుడు చేశాడు. కానీ ఆ సినిమా ఆల్రెడీ తెలుగులో వచ్చింది. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నాడు. ఇదీ తెలుగులో పోలీసోడుగా డబ్ అయింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేస్తోన్న భోళా శంకర్ కు కూడా తెలుగులో డబ్ అయిన వేదాళంకు రీమేక్. ఇప్పుడు ఆయన ఖాతాలో మరో రీమేక్ లాంటి సినిమా పడబోతోంది అనే వార్తలు వస్తున్నాయి. విశేషం ఏంటంటే ఇది తెలుగు సినిమానే.


1997లో ఇవివి సత్యానరాయణ దర్శకత్వంలో రూపొందిన మా నాన్నకు పెళ్లి చిత్రాన్ని పోలిన కథతోనే త్వరలో మెగాస్టార్ మరో సినిమా చేయబోతున్నాడు అనే వార్త టాలీవుడ్ లో హల్చల్ చేస్తోంది. అప్పట్లో కృష్ణంరాజు, శ్రీకాంత్ నటించారు. వీరికి పెయిర్ గా అంబిక, సిమ్రన్ నటించారు. భోళా శంకర్ తర్వాత చిరంజీవి చేయబోయే సినిమా కథ కూడా దాదాపు ఇదే అని టాక్. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు చిత్రాలతో విజయం అందుకున్న కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ మూవీలో చిరంజీవితో పాటు సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్నారు.


ప్రస్తుతం వినిపిస్తున్నట్టుగా మూవీ థీమ్ ప్రకారం భార్యను కోల్పోయిన తండ్రికి పెళ్లి చేయాలని ఆరాటపడే కొడుకు.. కొడుక్కి పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేసే తండ్రి నేపథ్యంలో ఉంటుందట. ఇలా చూసినా ఇంచుమించుగా ఇదే కథను ఆల్రెడీ గోవిందుడు అందరివాడేలో డ్యూయొల్ రోల్ లో చేశాడు చిరంజీవి. అయినా మళ్లీ అదే తరహా కథతో సినిమా అంటే ఖచ్చితంగా స్క్రీన్ ప్లేలో ఇంకేదైనా మ్యాజిక్ ఉండాలి. లేదంటే ఈ టైప్ స్టోరీస్ ఎప్పుడైనా చూస్తారు అనే నమ్మకం అయినా అయి ఉండాలి.


మరో విశేషం ఏంటంటే.. దాదాపు ఇదే కథతో కొన్నేళ్ల క్రితం నాగబాబు, తరుణ్‌ లతో ఓ కథ రెడీ అయింది. సినిమా సెట్స్ పైకి వెళ్లే ముందే ఆగిపోయింది. అంటే ఇప్పుడు మెగాస్టార్ తో ఆ స్టోరీతో పాటు మా నాన్నకు పెళ్లి, అందరివాడు సినిమాలను కలిపి ఓ కథ తయారు చేసి వినిపించి మరీ మెప్పించినట్టున్నాడు దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ. మరి ఈ కిచిడీ స్టోరీ మేటర్ నిజమా కాదా అనేది ఎవరో ఒకరు క్లారిఫై చేస్తే తప్ప తెలియదు.

Related Posts