Bholashankar : భోళా శంకర్ మేనియా షురూ.. ఇక గోల మొదలు

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా భోళా శంకర్ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ విడుదల చేసిన ఈ పాట ఫ్యాన్స్ కు ఊహించని సర్ ప్రైజ్ అనే చెప్పాలి. చాలామంది మూవీ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందనుకున్నారు. బట్ వీళ్లు ఏకంగా లిరికల్ సాంగ్ నే విడుదల చేశారు. ఇక ఈ పాట చూస్తే మంచి ఉత్సాహంగా ఉంది. ఒకప్పుడు చిరంజీవి సినిమాల్లో కనిపించిన హీరో ఎంట్రీ సాంగ్ ను తలపిస్తోంది.

లిరిక్స్ నుంచి స్టెప్స్ వరకూ, కంపోజిషన్ నుంచి సింగింగ్ వరకూ పూర్తిగా హీరో ఎంట్రీలో కనిపించే ఎలివేషన్స్ అన్నీ ఈ పాటలో ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా మెగా స్టెప్స్ మంచి జోష్ గానూ కనిపిస్తున్నాయి. ఇక ఒకప్పుడు బాస్ మూవీస్ కు అదిరిపోయే సాంగ్స్ ఇచ్చిన మణిరత్నం తనయుడు మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించాడు. రేవంత్ మంచి హుషారుగా పాడాడు.


తమిళ్ లో అజిత్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ వేదాళంకు రీమేక్ గా వస్తోన్న ఈ భోళా శంకర్ లో చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టుగా చాలా మార్పులు చేశారు. మెగాస్టార్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఆయనకు చెల్లెలుగా కీర్తి సురేష్‌ నటించడం విశేషం.

ఇక దర్శకుడుగా ఎప్పుడో వెనకబడిపోయిన మెహర్ రమేష్‌ .. భోళా శంకర్ తో మరోసారి తన లక్ ను చెక్ చేసుకోబోతున్నాడు. మొత్తంగా ఆగస్ట్ 11న విడుదల కాబోతోన్న భోళా శంకర్ నుంచి బాస్ మేనియా స్టార్ట్ అయిందనే చెప్పాలి.

Related Posts