Megastar : చిరంజీవిని తప్పుగా అర్థం చేసుకున్నారు

నలుగురికి మంచి చేయడంలో మెగాస్టార్ చిరంజీవి తర్వాతే ఎవరైనా.. తను ఏదైనా ఫంక్షన్ కు వెళ్లినా.. దాని ద్వారా తన అభిమానులకు, సినిమా వారికి ఏదైనా మేలు జరుగుతుంది అని తెలిస్తే అదే వేదికపై ప్రకటిస్తాడు. అక్కడి వారి సాయం కూడా వెంటనే కోరతాడు. అలాగే తాజాగా ఆయన ఓ హాస్పిటల్ కు సంబంధించిన కార్యక్రమానికి హాజరయ్యాడు.

అక్కడ క్యాన్సర్ సెంటర్ ను ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ ను ముందుగానే పసిగట్టగలితే ప్రమాదం ఉండదు. ఒకప్పుడు నేనూ ఒక చిన్న టెస్ట్ తో ఆ ఇబ్బంది నుంచి బయటపడ్డాను అని యధాలాపంగా అన్నాడు. అంతే.. అసలేం లేకుండానే రకరకాల రూమర్స్ అనే వాళ్లంతా.. ఈ చిన్న పాయింట్ తో ఏకంగా మెగాస్టార్ కు క్యాన్సర్ వచ్చిందంటూ హంగామా చేశారు. ఇది చూసి అభిమానులు కూడా నిజమా అని కంగారు పడ్డారు. ఈ ప్రమాదాన్ని వెంటనే పసిగట్టిన ఆయన వెంటనే ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు.

“కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non – cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. ‘అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో’ అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి’ అని మాత్రమే అన్నాను.


అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో ‘నేను క్యాన్సర్ బారిన పడ్డాను’ అని ‘చికిత్స వల్ల బతికాను’ అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు. 🙏”.. అంటూ ట్వీట్ చేశాడు.


ఇదీ మెగాస్టార్ చెప్పిన వివరణ. నిజానికి ఆయనకు క్యాన్సర్ రాలేదు. వచ్చినట్టుగా కొందరు తప్పుడు వార్తలు రాశారు. ఇంక ఇక్కడ అసలు విషయాన్ని కూడా దాచేశారు చాలామంది. ఈ కార్యక్రమంలోనే తమ సినిమా కార్మికులకు ఉచితంగా లేదా తక్కువ ఫీజ్ తో క్యాన్సర్ పరీక్షలు చేయించేలా ఏర్పాటు చేయాలని.. అందుకు ఎంత ఖర్చైనా తమ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ భరిస్తుందని హామీ తీసుకున్నాడు. ఈ విషయం ఎవరూ చెప్పలేదు. ఇది కూడా కొంత చిరంజీవిని బాధించిందనే చెప్పాలి. ఏదేమైనా మెగాస్టార్ ను తప్పుగా అర్థం చేసుకుని తప్పుడు వార్తలు రాసినవాళ్లంతా క్షమాపణ చెప్పాల్సిందే.

Related Posts