OG : సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోతోన్న పవన్ కళ్యాణ్‌

ఈ మధ్య ఎప్పుడూ లేనంత వేగంగా ఒక సినిమా షూటింగ్ చేస్తున్నాడు. అది కూడా ముందుగా ఒప్పుకున్న సినిమాలను పక్కన బెట్టి మరీ ఈ చిత్రానికి ప్రాధాన్యం ఇస్తున్నాడు. రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీ అప్పుడే థర్డ్ షెడ్యూల్ లోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఏంటో గెస్ చేశారా..? యస్.. ”ఓజి”.. అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని ముందే చెప్పారు కదా..? రన్ రాజా రన్, సాహో ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

నిజానికి త్రివిక్రమ్ ఫైనల్ చేసిన కథ ఇది. అందుకే అన్నిటికంటే కాస్త ముందుకు వచ్చింది. మరోవైపు పవన్ కు బాగా ఇష్టమైన గన్స్, తుపాకులు చాలా ఉండటంతో అతను కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం ముంబైలో ఐదు రోజుల షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఐదు రోజుల అవుట్ పుట్ నచ్చడంతో అక్కడే మరో వారం రోజులు కాల్షీట్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్‌. ఆ తర్వాత కూడా వెంటనే హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. రీసెంట్ గా ఈ రెండో షెడ్యూల్ కూడా ముగిసిపోయింది.

మధ్యలో కొన్ని రోజులు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఇచ్చినా.. మళ్లీ ఓజి థర్డ్ షెడ్యూల్ కు డేట్స్ ఇచ్చాడు. ఈ ఆదివారం నుంచే ఓజి మూడో షెడ్యూల్ మొదలు కావడం విశేషం. మరి కంటెంట్ బాగా నచ్చడంతో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా లేక త్రివిక్రమ్ సిఫారసు చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడా అనేది చెప్పలేం కానీ.. ఈ మూవీని ఓ డిసెంబర్ 24 రిలీజ్ టార్గెట్ గా షూటింగ్ చేస్తున్నారు అని మాత్రం చెప్పాలి.


డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్‌ రాజ్ ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తాడట. ఏదేమైనా ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్‌ చూపిస్తోన్న స్పీడ్ కు ఆయన సన్నిహితులు కూడా ఆశ్చర్యపోతున్నారని టాక్.

Related Posts