భోళా శంకర్ సెన్సార్ పూర్తి

మెగాస్టార్ చిరంజీవి, కీర్తి సురేష్‌, తమన్నా, సుశాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా భోళా శంకర్. మెహర్ రమేష్‌ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కాబోతోంది. మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు. సినిమాపై ట్రైలర్ తర్వాత అంచనాలు పెరిగాయి.

వాల్తేర్ వీరయ్య తరహాలో కంప్లీట్ మెగా ఎంటర్టైనర్ లా ఉంటుందని అర్థమైంది. పాటలు గొప్పగా లేకపోయినా ఎంటర్టైన్మెంట్ కు తో పాటు యాక్షన్ కు ఢోకా ఉండదని ట్రైలర్ తో తేలిపోయింది. ఎలా చూసినా సినిమాపై మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ సెన్సార్ అయింది. సెన్సార్ బోర్డ్ నుంచి సినిమాకు “యూ/ఏ” సర్టిఫికెట్ వచ్చింది. అయితే నాలుగు చోట్ల సవరణలు సూచించింది సెన్సార్ బోర్డ్.

  1. సిగరెట్ స్మోకింగ్, డ్రికింగ్ కు సంబంధించిన హెచ్చరికల సూచనలు తెలిపే అక్షరాలను పెద్దగా మార్చాలని చెప్పింది.
  2. సీన్ నెంబర్ 21లో డ్రగ్స్ కు సంబంధించిన వార్నింగ్ డిస్ క్లెయిమర్ ను స్పష్టంగా చూపాలని సూచించింది.
  3. ఇంటర్వెల్ బ్యాంగ్ లో విలన్ తలనరికే సీన్ ను యాభై శాతం తగ్గించాలని చెప్పింది. ఆ టైమ్ లో వేరేవారి క్లోజప్ షాట్స్ వాడాలని సూచించింది.
  4. బద్ధల్ బాషింగాల్ అనే పదాలను టెక్ట్స్ గా వాడుతున్నప్పుడు తొలగించాలని, డైలాగ్ లో ఉంటే మ్యూట్ చేయాలని సూచించింది

ఇలా నాలుగు సవరణలతో భోళా శంకర్ కు యూ/ ఏ సర్టిఫికెట్ ఇష్యూ చేసింది సెన్సార్ బోర్డ్.

Related Posts