ఆకాశం దాటి వస్తావా టీజర్ టాక్

దిల్ రాజు తన వారసులను కూడా నిర్మాతలుగా నిలబెడుతున్నాడు. వారితో ఆల్రెడీ బలగం వంటి బ్లాక్ బస్టర్ తీయించాడు. ఇప్పుడు అదే హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డితో ఆకాశం దాటి వస్తావా అనే సినిమా తీయిస్తున్నాడు.రీసెంట్ గానే ఈ మూవీ అనౌన్స్ అయింది. అప్పుడే టీజర్ తో వచ్చారు. అంటే షూటింగ్ ఎప్పుడో మొదలైందీ అనుకోవచ్చు. కొరియోగ్రాఫర్ యశ్ మాస్టర్ ను హీరోగా పరిచయం చేస్తూ దిల్ రాజు వారసులు నిర్మించిన ఈ చిత్రానికి “ఆకాశం దాటి వస్తావా” అనే టైటిల్ కూడా అప్పుడే ఫిక్స్ చేశారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది.


ఆకాశం దాటి వస్తావా టీజర్ఇంప్రెసివ్ గా ఉంది. ఓ హానెస్ట్ లవ్ స్టోరీని చూడబోతున్నాం అనిపించేలా ఉంది. తను ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరమైనా వెళ్లే ప్రేమికుడు తనది లో బడ్జెట్ ప్రేమ అని చెప్పడం.. నెలకు 25వేలు ఇఎమ్ఐ కట్టాలని చెప్పడం.. మధ్యలో వారి ప్రేమమాటలు, విజువల్స్, లవ్ ట్రాక్.. ఇవన్నీ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఈ టీజర్ లో. మరి టీజర్ లో మాత్రమేనా సినిమా కూడా అంతే ఫ్రెష్‌ గా ఉంటుందా అనే డౌట్ రాకుండా కట్ చేశారు. నిజంగా ఆకాశం దాటి వస్తావా టీజర్ లవబుల్ గా ఉంది. చూస్తోంటే మిడిల్ క్లాస్ ప్రేమలోని సంఘర్షణను చూపించబోతున్నారా అనిపిస్తోంది. ఇంత త్వరగా టీజర్ విడుదల చేశారు కాబట్టి సినిమా కూడా త్వరగానే వస్తుందనుకోవచ్చు. మరి ఇంతే హానెస్ట్ గా సినిమా కూడా ఉంటుందా లేదా అనేది చూడాలి.

Related Posts