మాయా పేటిక నుంచి భలే పాట

మాయా పేటిక.. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ చూస్తే.. ఫలానా వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా అని కాకుండా.. పాత్రలే ప్రధానంగా కనిపించబోతోన్న సినిమా అనాలనిపించేలా ఉంది. అటు హాస్యంతో పాటు జీవితంలోని అనేక కోణాలను ఒక సెల్ ఫోన్ ద్వారా టచ్ చేసినట్టుగా కనిపించింది.

అయితే ఆ ట్రైలర్ లో తనదైన ఉనికిని నిలుపుకున్నాడు నటుడు శ్రీనివాస రెడ్డి. ఇప్పటి వరకూ కమెడియన్ గా ఆకట్టుకుని మధ్యలో మూడు నాలుగు సినిమాల్లో హీరోగానూ మెప్పించిన శ్రీనివాసరెడ్డి ఫస్ట్ టైమ్ ఓ డిఫరెంట్ రోల్ తో రాబోతున్నాడని అర్థమైంది. ఆ పాత్ర ప్రేక్షకులనూ భావోద్వేగానికి గురి చేస్తుందని అప్పుడే అనుకున్నారు. అది నిజమే అనేలా తాజాగా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన లిరికల్ సాంగ్ చూస్తే తెలుస్తుంది.


మాయా పేటిక నుంచి విడుదలైన లిరికల్ సాంగ్ అంతా శ్రీనివాస రెడ్డి పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఈ పాటకు ఆ పాత్రకే కాక నిజ జీవితంలోనూ ఎంతోమందికి రిలేట్ అయ్యే సాహిత్యం కూడా అమరింది. కాల భైరవ ఇప్పటి వరకూ పాడిన పాటలకు పూర్తి భిన్నంగా ఉంది. గొంతులోనూ ఓ వైవిధ్యాన్ని చూపించాడు కాల భైరవ.


గుణ బాలసుబ్రహ్మణ్యన్ సంగీతానికి ప్రియాంక రాసిన ఈ పాట ” ఓ మనిషీ ఎందుకో నీకిలా ఆరాటమే.. నీకంటూ లేదుగా ఎప్పుడూ ఏ తీరమే.. నువ్వు కన్న కలలన్నీ నీవి కావులే.. పై వాడు రాసేటి నుదుటి రాతలే..” అంటూ మొదలైన ఈ పాట శ్రీనివాస రెడ్డి పాత్ర సంఘర్షణను చూపించేదిలా ఉంది. ” కన్ను చూసే కథలే ఎన్నో.. మనసు చూసే వ్యథలే ఎన్నో.. అంతులేని ఈ ప్రయాణం పోరాటమే.. ” అంటూ సాగే సాహిత్యం చాలా మెచ్యూర్డ్ గా ఉంది.


పాటలోని విజువల్స్ చూస్తే శ్రీనివాసరెడ్డి హిజ్రా వేషంలో భిక్షాటన చేస్తూనే ఓ కోతిని ఆడించుకుంటూ బ్రతికే వ్యక్తి పాత్రలో కనిపిస్తున్నాడు. మరి చేతిలో ఉన్న మాయా పేటిక అయిన సెల్ ఫోన్ వల్ల అలాంటి వ్యక్తి జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగాయో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. బట్ ఈ పాట మాత్రం ఖచ్చితంగా ఆకట్టుకునేలా ఉందనే చెప్పాలి.

Related Posts