సిద్ధు సినిమాకు స్పాన్ పెరుగుతోంది..

సిద్ధు జొన్నలగడ్డ కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. తనూ రైటర్ కావడంతో ఏ కథలో ఏముందో.. ఆ కథ తనకు సరిపోతుందో లేదో సరిగ్గా అంచనా వేయగలడు. అందుకే డిజే టిల్లు తర్వాత చాలా కథలే వచ్చినా దేనికీ ఎస్ చెప్పలేదు. ఫైనల్ గా ఈ చిత్రానికే సీక్వెల్ గా డిజే టిల్లు స్క్వేర్ చేస్తున్నాడు.

ఈ మూవీ తర్వాత అనూహ్యంగా అతను సమంతతో సినిమా చేస్తాడు అనే వార్తలు వచ్చాయి. అవి నిజమే కానీ.. ఇంకా సమంతే ఓకే చెప్పలేదు. ఆశ్చర్యంగా ఈ చిత్రానికి నీరజా కోన దర్శకురాలు. టాలీవుడ్ టాప్ డిజైనర్ గా ఉన్న నీరజా ఈ మూవీతో డైరెక్టర్ గా మారుతోంది. అయితే ఇది తన ఫస్ట్ మూవీయే అయినా.. ఈ మూవీ స్పాన్ ను ఎవరూ ఊహించనంతగా పెంచేస్తోందీ లేడీ. తెలుగులో లేడీ డైరెక్టర్స్ తక్కువ. ఉన్నవాళ్లలో సక్సస్ అయింది నందిని రెడ్డి మాత్రమే. ఆ తర్వాత ప్లేస్ లోనే తను ఉండేలా ప్లాన్ చేసుకుంటోంది నీరజ.

అందుకే ఈ చిత్రానికి టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ ను సెలెక్ట్ చేసుకుంది. అది కూడా అనూహ్యమే.
ప్రధానంగా ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నర్ సినిమాటోగ్రఫీ పిసి శ్రీరామ్ చేయబోతున్నాడు. పిసి శ్రీరామ్ తో వర్క్ చేయాలని కలలు కనని దర్శకుడు ఉండడు. ఫస్ట్ మూవీకే ఆ ఛాన్స్ కొట్టేసింది నీరజా కోన.

ఆయన లెన్స్ మాత్రమే కాదు.. అనుభవం కూడా ఈమెకు చాలా ఉపయోగపడుతుంది. షాట్ డివిజన్ నుంచి ఫ్రేమింగ్ వరకూ నీరజకు పెద్దగా ఇబ్బంది ఉండదు ఇంక. అలాగే ఎడిటర్ గా మరో నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ను తీసుకుంది. శ్రీకర్ ఎడిటింగ్ కథ నచ్చితే తప్ప కాదు అంటారు. వీరితో పాటు ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను షర్మిష్ట రాయ్ చూసుకోబోతోంది.తనూ నేషనల్ అవార్డ్ విన్నరే కావడం విశేషం..

ఇక తమన్ సంగీతం అందిస్తుంటే.. బృందా మాస్టర్ కొరియోగ్రఫీ చేయబోతోంది. వీళ్లంతా నేషనల్ లెవల్లో గుర్తింపు ఉన్న టాప్ టెక్నీషియన్స్. ఇలాంటి టెక్నీషియన్స్ ఉన్నారంటే సినిమా స్పాన్ కూడా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఏదేమైనా డైరెక్టర్ గా నీరజా కోనకు ఇదో బెస్ట్ డెబ్యూ అవుతుందేమో చూద్దాం.

Related Posts