సైలెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘భగవంత్ కేసరి‘

దసరా బరిలో విడుదలైన ‘భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తనశైలికి భిన్నంగా వైవిధ్యభరితమైన కథతో అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని రూపొందించాడు. విడుదలైన మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ‘భగవంత్ కేసరి‘ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రూ.140 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ‘అఖండ, వీరసింహారెడ్డి‘ తర్వాత వరుసగా బాలయ్యకి హ్యాట్రిక్ హిట్ అందించిన చిత్రమిది. ఇక.. ‘భగవంత్ కేసరి‘ బాక్సాఫీస్ రన్ పూర్తవ్వడంతో ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తోందా? అంటూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు సినీ ప్రియులు.

ఎలాంటి హడావుడి లేకుండా నేటి నుంచే (నవంబర్ 24) ‘భగవంత్ కేసరి‘ ఓటీటీ స్ట్రీమింగ్ మొదలయ్యింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఆమధ్య ‘టైగర్ నాగేశ్వరరావు‘ విషయంలో ఇదే జరిగింది. ఎలాంటి ప్రచారం లేకుండానే రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు‘ సినిమాని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది అమెజాన్. ఇప్పుడు ‘భగవంత్ కేసరి‘ విషయంలోనూ అదే జరిగింది. మొత్తంమీద.. థియేట్రికల్ గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ‘భగవంత్ కేసరి‘ ఓటీటీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Related Posts