‘ఆదికేశవ’ రివ్యూ..

తారాగణం : పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, అపర్ణా దాస్, రాధికా, సదా తదితరులు
ఎడిటర్ : నవీన్ నూలి
సంగీతం : జివి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ : సంతోష్ డెకాటే
నిర్మాతలు : నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం : శ్రీకాంత్ ఎన్. రెడ్డి

నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘ఆదికేశవ’. లవ్ అండ్ యాక్షన్ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా జోజు జార్జ్, అపర్ణా దాస్, రాధికా, సదా ఇతర కీలక పాత్రల్లో నటించారు. మరి ఈరోజు(24.11.2023) థియేటర్స్‌లో వచ్చిన ‘ఆదికేశవ’ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ: రాయలసీమ ప్రాంతంలో క్రూరంగా కనిపించే చెంగారెడ్డి(జోజు జార్జ్) తను చేస్తున్న మైనింగ్స్ లో చిన్న పిల్లలను పనిలో పెట్టుకొని ఆ ఊరినే శాసిస్తుంటాడు. హైదరాబాద్ లో బాలకోటయ్య (పంజా వైష్ణవ్ తేజ్) ఉద్యోగం కోసం తిరుగుతూ ఉంటాడు. తన తల్లి(రాధికా శరత్ కుమార్) కోరిక మేరకు ‘ఎర్తి’ అనే కాస్మటిక్స్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళతాడు. ఆ కంపెనీ సీఈఓ గా చేస్తున్న చిత్రావతి (శ్రీలీల) ని తొలిచూపులోనే ప్రేమించి అక్కడే జాబ్ సంపాదిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది.. కథలో ఎలాంటి ట్విస్టులున్నాయి.. చెంగారెడ్డితో బాలు ఎందుకు తలపాడాల్సి వచ్చింది..? అనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉంది..

కొత్త దర్శకుడైనా మాస్ కథను బాగా ఢీల్ చేశాడు. ముఖ్యంగా వైష్ణవ్ తేజ్‌తో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చేయించి బాగానే సక్సెస్ అయ్యాడు. శ్రీలీల కూడా ఉన్నంతలో బాగానే పర్ఫార్మ్ చేసింది. వైష్ణవ్, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా కాస్త సిల్లీగా అనిపించినా యూత్ ఆడియన్స్ బాగానే ఎంజాయ్ చేస్తారు. వైష్ణవ్, జోజు జార్జ్ మధ్య యాక్షన్ ఎపిసోడ్ హైలెట్‌గా అనిపిస్తుంది. అయితే, సినిమాలో బలమైన కథ కథనాలు లేకపోవడం మైనస్ అయింది. మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి సినిమా తీసినప్పటికీ చాలావరకు లాజిక్స్ మిస్సయ్యాయి. ఈ తరహా కథలు ఇప్పటికే చాలా వచ్చాయి. బలమైన కథ లేకపోవడం వల్ల ఆడియన్స్ బోర్ గా ఫీలవుతారు. దర్శకుడు చూపించిన ట్విస్టులు కూడా అంత ఆకట్టుకునే విధంగా లేవు. ఫస్టాఫ్ ని కథలోకి తీసుకెళ్లేందుకు పాటలు అడ్డుపడిన భావన కలుగుతుంది. విలన్ గా నటించిన జోజు జార్జ్ పాత్ర ఇంకా బెటర్‌గా ఉంటే బావుండేది.

నటీనటుల విషయానికొస్తే:

హీరో పంజా వైష్ణవ్ తేజ్ తన క్యారెక్టర్ వరకూ బాగానే చేశాడు. ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే ఆదికేశవ లో తన పర్ఫార్మెన్స్ బాగా మెరుగుపడింది. శ్రీలీల తన గ్లామర్‌తో మెప్పిస్తుంది. మిగిలిన వారంతా వారి పాత్ర పరిధిమేరకు బాగానే నటించారు. నిర్మాణ విలువలు బావున్నాయి. పాటల్లో లీలమ్మో సాంగ్ అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. శేఖర్ మాస్టర్ శ్రీలీలతో వేయించిన స్టెప్పులకి థియేటర్స్‌లో విజిల్స్ పడుతున్నాయి. ఓవరాల్‌గా ఈ సినిమా ఎక్కువగా మాస్ ఆడియన్స్‌కి నచ్చుతుంది.

Related Posts