డార్లింగ్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ పై ఆశలు వదిలేసుకున్నట్టుగానే చెప్పుకోవాలి. ప్రభాస్ లాంటి స్టార్ తో సినిమా చేస్తున్నప్పుడు స్క్రిప్ట్ తో పాటు కాస్త ఒళ్లు కూడా దగ్గర పెట్టుకుని చేయాలి. లేదంటే అది ఆదిపురుష్ అవుతుందని తాజాగా ప్రూవ్ అయింది. నిజానికి ఈ మూవీలో ప్రభాస్ ఉన్నాడు కాబట్టే అన్ని కలెక్షన్స్ వచ్చాయి తప్ప.. ఈ కంటెంట్ తో వేరే హీరో అయితే వీకెండ్ లోనే సర్దేసుకునేది. ఇక ఫ్యాన్స్ కూడా వదిలేసుకున్న ఈ చిత్రం తర్వాత అందరి దృష్టి ప్రశాంత్ నీల్ మూవీ సలార్ పై ఉంది.
ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకూ తీసింది మూడు సినిమాలే అయినా అతను దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అందుకు కారణం కేజీఎఫ్. ఈ మూవీ రెండు చాప్టర్స్ తో ఎవరూ ఊహించనంత బ్లాక్ బస్టర్స్ అందించాడు. పైగా అతని టేకింగ్, మేకింగ్, షాట్ డివిజన్, ఎలివేషన్స్ అన్నీ వేరే లెవల్లో ఉంటాయి. ఇక ప్రభస్ లాంటి స్టార్ చేతిలో ఉంటే ఇంకెలా ఉంటుంది. ఇక కేజీఎఫ్ లో మందర్ సెంటిమెంట్ తో అదరగొట్టిన ప్రశాంత్ నీల్ ఈ సారి కూడా ఆ తరహా సెంటిమెంట్ తోనే ఆడియన్స్ ను ఎంటర్టైనర్ చేయబోతున్నాడని టాక్.
ఎంత యాక్షన్ మూవీ అయినా సెంటిమెంట్ కు సరిగ్గా పండితే.. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని బాక్సాఫీస్ ఎప్పుడో చెప్పింది. అందుకే ప్రశాంత్ నీల్.. ప్రభాస్ తో ఈ సారి ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ తో చూపించబోతున్నాడని టాక్.
అంటే కేజీఎఫ్ లో అమ్మ చెప్పిందని మొత్తం బంగారాన్ని దొంగిలించాడు హీరో. తనే అత్యంత సంపన్నుడుగా మారాడు. ఈ మూవీలో కూడా ఓ స్నేహితుడి కోణంలో కథ చెప్పబోతున్నాడు.
ఆ ఫ్రెండ్ కోణంలో వచ్చే సెంటిమెంట్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే అంటున్నారు. తన స్నేహితుడి కోసమే ఓ పెద్ద విలన్ ను ఢీ కొట్టేందుకు ముందుకు వెళతాడట సలార్ ప్రభాస్. ఓ రకంగా చూస్తే ఈ మధ్య కాలంలో గొప్ప స్నేహం నేపథ్యంలో మంచి సినిమాలేం రాలేదు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఆ తరహా మూవీకి యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉంటే కమర్షియల్ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోవచ్చు.
ఇక ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు మళయాల స్టార్ హీరో పృథ్విరాజ్, శ్రుతి హాసన్, శ్రేయా రెడ్డి, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. మరి వీరిలో ఎవరు అతని ఫ్రెండ్ గా కనిపిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…
రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…
Teja Sajja, who became a new star with the movie 'Hanuman', is playing the hero…
Man of masses NTR's birthday.. Only two more days left. He is acting as Young…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…