తెలుగు సినిమాపై బప్పిలహిరి ముద్ర

తెలుగు సినిమా సంగీతాన్ని సుసంపన్నం చేసిన వారిలో ఎంతోమంది పరభాషా సంగీత దర్శకులు ఉన్నారు. అయితే.. వారిలో ఎక్కువగా తమిళం, మలయాళం నుంచి వచ్చిన వారే. ఎంతో అరుదుగా బాలీవుడ్ సంగీత దర్శకులు తెలుగు సినిమాలకు పనిచేశారు. అలాంటి వారిలో అత్యుత్తమ సంగీత దర్శకుడు బప్పలహిరి. 80ల చివర్లో మొదలై.. 90ల ఆరంభంలో తెలుగు సినిమాని ఊపేసిన అత్యద్భుతమైన సంగీత దర్శకుడాయన.

ముఖ్యంగా కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ లకు బప్పిలహిరి మెమరబుల్ మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. హీరో కృష్ణ నటించిన ‘సింహాసనం’ చిత్రంతో టాలీవుడ్‌ లోకి అడుగుపెట్టి.. తొలి సినిమాతోనే సంచలనాలు సృష్టించాడు. ఈ సినిమాలోని పాటలు ఎవర్ గ్రీన్ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఆ తర్వాత చిరంజీవితో ‘స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, బిగ్ బాస్’ సినిమాలు చేస్తే.. బాలకృష్ణతో ‘రౌడీ ఇన్స్పెక్టర్, నిప్పురవ్వ’ వంటి సినిమాలకు సంగీతాన్నందించాడు. మధ్యలో చాలా తెలుగు సినిమాలకు పనిచేసినా.. చివరగా రవితేజ ‘డిస్కోరాజా’ కోసం బప్పిలహిరి ఓ పాట పాడటం విశేషం. నేడు (నవంబర్ 27) బప్పిలహిరి జయంతి.

Related Posts