మీరే నా హీరో..సమంత ఇన్స్టా పోస్ట్ వైరల్..

మ‌ల‌యాళం స్టార్ మ‌మ్ముట్టి గురించి స్టార్ హీరోయిన్ సమంత తన ఇన్స్టా స్టేటస్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మ‌మ్ముట్టి, జ్యోతిక జంటగా రూపొందిన ‘కాథల్ ది కోర్’ ఈ మధ్యనే రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది. కథ ప‌రంగా కొన్ని విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. స్వ‌లింగ సంపర్కాన్ని ప్రోత్స‌హించేలా ఈ సినిమాలో కథ కథనాలున్నాయని కువైట్, ఖ‌త‌ర్ దేశాలు ‘కాథల్ ది కోర్’ చిత్రాన్ని బ్యాన్ చేసాయి.

అయితే, సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం అంతా పాజిటివ్ గా మాట్లాడుకున్నారు. జియో బేబి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాకి రివ్యూలు పాజిటివ్ గా వ‌చ్చాయి. విమ‌ర్శ‌కులు కూడా ఈ సినిమాని మెచ్చుకున్నారు. ఇందులో ఉన్న ఫ్యామిలీ డ్రామా కేర‌ళ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంది. ఈ నేప‌థ్యంలో ‘కాథల్ ది కోర్’ చిత్రాన్ని ఇతర దేశాలలో కూడా విడుదల చేయాలంటూ కోరుతున్నారు.

అయితే, తాజాగా స‌మంత ఈ మూవీపై ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రాం లో పోస్ట్ పెట్టారు. ‘సినిమా ఆఫ్ ది ఇయర్. మమ్ముటీ సార్.. మీరే నా హీరో. జ్యోతిక లవ్ యూ. ఇద్ద‌రు ఎంతో గొప్పగా న‌టించారు. మీ న‌ట‌న‌లో స‌హ‌జ‌త్వం న‌న్ను బాగా ఆక‌ట్టుకుంది. జియో బేబీ ఓ లెజెండరీ మేక‌ర్. నా సంతోషాన్ని మీతో పంచుకోకుండా ఉండ‌లేక‌పోయాను. ఇంకా మీ నుంచి ఇలాంటి గొప్ప సినిమాలు రావాలి’ అని స్టేటస్ లో పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Related Posts