బాలయ్య 109 విడుదలయ్యేది ఎప్పుడు?

టాలీవుడ్ లో విజయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాడు నటసింహం బాలకృష్ణ. మరే సీనియర్ హీరో లేనంతగా ఇప్పుడు బాలయ్య ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇదే ఊపులో అప్ కమింగ్ మూవీ ‘ఎన్.బి.కె.109’తో మరో భారీ విజయాన్ని దక్కించుకునేందుకు రెడీ అవుతున్నాడు.

బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న బాలకృష్ణ 109వ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేలా ఉన్నాయి. ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ‘సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్’ అంటూ తనదైన పవర్ ఫుల్ డైలాగ్స్ తో గ్లింప్స్ లో చెలరేగిపోయాడు బాలయ్య. ఇప్పటికే చాలాభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీ ఎన్నికల తర్వాత బ్యాలెన్స్ వర్క్ పూర్తిచేసుకోనుంది.

దాదాపు ఫినిషింగ్ స్టేజ్ కు చేరుకున్న ‘ఎన్.బి.కె. 109’ మూవీ టైటిల్, హీరోయిన్, రిలీజ్ డేట్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాలో బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి వంటి భారీ తారాగణమే ఉంది. అయితే.. బాలయ్యకి జోడీగా నటించే హీరోయిన్ ఎవరనేది తెలియలేదు. అలాగే.. టైటిల్ పైనా క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యంగా.. ‘ఎన్.బి.కె. 109’ విడుదల ఎప్పుడు? అనేదే నందమూరి ఫ్యాన్స్ ను ఎంతో ఎగ్జైట్ చేస్తున్న విషయం.

ముందుగా ఈ చిత్రం సంక్రాంతి బరిలో వస్తోంది? అనుకున్నారు. అయితే.. సంక్రాంతికి మూడు, నాలుగు నెలలు ముందుగానే ఈ మూవీ రెడీ అయిపోతుంది కాబట్టి.. అంతవరకూ విడుదల తేదీ వెళ్లదు. మరోవైపు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ రవితేజా చిత్రాన్ని ఆల్రెడీ సంక్రాంతి బరిలో ఫిక్స్ చేసింది. ఒకవేళ దసరా రేసులో వస్తాడా? అంటే ఆల్రెడీ ‘దేవర’ ఫిక్స్ అయ్యి ఉంది. ‘దేవర’ చిత్రాన్ని కూడా తెలుగు రాష్ట్రాల్లో సితార సంస్థే విడుదల చేయబోతుంది. మరి.. పండగలను టార్గెట్ చేయకపోతే.. బాలయ్య 109 వచ్చేదెప్పుడు? అనేది అందరిలోనూ ఆసక్తిని కలగజేస్తుంది. మరి.. త్వరలోనే బాలయ్య 109 విడుదల తేదీపై అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

Related Posts