బలగం వాట్ ఏ రికార్డ్

ఒక చిన్న సినిమా.. ఎంత పెద్ద సంచలనం సృష్టించింది. థియేటర్స్ లో అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఇక ఎప్పటికీ చూడలేం అనుకున్న అనేక సంఘటనలు పునరావృతం అయ్యేలా చేసింది. లేదంటే ఈ సినిమా కోసం ఊళ్లకు ఊళ్లు కదలి వెళ్లాయి. ఊళ్లల్లో ప్రదర్శనల కోసం డిమాండ్ లు వచ్చాయి.

ఓటిటిలో వచ్చిన తర్వాత విపరీతంగా చూశారు. చూసిన ప్రతి ఒక్కరూ హృదయాలు బరువెక్కి.. వెక్కి వెక్కి ఏడ్చేలా చేసిది. ఎప్పుడో విడిపోయి అన్నదమ్ములను, అన్న చెల్లెళ్లను కలిపింది. ఒక సినిమాకు ఇంత పవర్ ఉందని ఈ తరానికి మొదటగా తెలిపిన సినిమా ఇదే అంటే అతిశయోక్తి కాదు.

ఎప్పుడో టివిలు లేని కాలంలో సినిమాలు చేసిన మ్యాజిక్ ను ఈ చిత్రం మళ్లీ రిపీట్ చేసింది. అంతే కాదు.. తెలుగు సినిమాకు ఎప్పటికైనా సాధ్యం అవుతుందా అనిపించేలా మరో అరుదైన రికార్డ్ ను సాధించింది.
ఒకప్పుడు సినిమాలు ఎన్ని కేంద్రాల్లో 50, 100 రోజులు ఆడాయి అనే లెక్కలతో ఆ చిత్ర విజయాన్ని కొలిచేవారు. ఇప్పుడు కలెక్షన్స్ చెబుతున్నాయి ఆ మాట. ఈ విషయంలో ఈ చిత్ర బడ్జెట్ కు వచ్చిన కలెక్షన్స కు కౌంట్ వేస్తే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి.

అదీ కాక మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది బలగం. ఈ చిత్రం ఇప్పటి వరకూ 2023 మార్చి 23న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకూ 100 అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. వివిధ దేశాలు, వివిధ కేటగిరీస్ లో 100 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న మరో తెలుగు సినిమా ఉందా అంటే ఇప్పటి వరకైతే లేదు అనే చెప్పాలి. ఒకవేళ ఉన్నా.. ఇంత తక్కువ టైమ్ లో గెలుచుకున్న సినిమాగా కూడా బలగం మరో మెట్టు పైనే ఉంటుంది.


ఇప్పటి వరకూ కమెడియన్ గా ఆకట్టున్న వేణు యెల్దండి మొదటిసారిగా డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేయడం అరుదైన విషయమే. దిల్ రాజు వారసులు హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి నిర్మించిన బలగం.. మరికొన్ని తరాల వరకూ ఇన్స్ స్పైర్ చేస్తుందనే చెప్పాలి. ఏదేమైనా ఈ అరుదైన రికార్డ్ సాధించిన ఎంటైర్ బలగం మూవీ టీమ్ కు తెలుగు 70ఎమ్ఎమ్ హార్థిక శుభాకాంక్షలు తెలుపుతోంది.

Related Posts