అభిమానులకు నిఖిల్ లెటర్

నిఖిల్ సిద్ధార్థ్.. జూన్ 29న స్పై మూవీతో వచ్చాడు. వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేస్తోన్న అతని జర్నీకి ఈ మూవీ స్పీడ్ బ్రేకర్ వేసింది. భారీ అంచనాల మధ్య వచ్చిన స్పై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

నిజానికి ఈ మూవీని జూన్ లో విడుదల చేయొద్దని నిర్మాతలతో వాదించాడు నిఖిల్. కానీ నిర్మాతలు అతనికే సర్ది చెప్పి రిలీజ్ చేశాడు. రిలీజ్ డేట్ వల్ల రిజల్ట్ మారిందని చెప్పలేం కానీ.. ఈ మూవీ పోయింది. అయితే ప్యాన్ ఇండియన్ రేంజ్ లోవిడుదల చేయాలని అన్ని చోట్ల ప్రమోషన్స్ కూడా చేశాడు నిఖిల్. కానీ ఆ విషయంలో వీళ్లు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాలేదు అని చెబుతూ ఈ లెటర్ రాశాడు నిఖిల్.


స్పై మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాడు. ప్యాన్ ఇండియన్ స్థాయిలో విడుదల చేయాలని ప్రయత్నించినా.. కంటెంట్ డిలే వల్ల రిలీజ్ చేయలేకపోయాం అని చెప్పాడు. ఓవర్శీస్ లో 350 షోస్ క్యాన్సిల్ అవడానికి కారణం కూడా అదే అన్నాడు. ఈ సందర్భంగా తమిళ్, కన్నడ, మళయాల ప్రేక్షకులకు సారీ చెప్పాడు. కార్తికేయ2 తర్వాత వచ్చే మూడు సినిమాలను ప్రాపర్ గా రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తాను అని తెలియజేశాడు.


ఇక తెలుగు ప్రేక్షకులకూ ఓ ప్రామిసింగ్ చేస్తున్నాడు. ఇకపై ఎంత ప్రెజర్ ఉన్నా.. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కానని.. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతే ఓ మంచి క్వాలిటీ అవుట్ పుట్ తో వస్తాను అంటున్నాడు.


మొత్తంగా నిఖిల్ లెటర్ చూస్తుంటే స్పై పోయిందని చెప్పలేక ఇంకేదో కవర్ చేస్తున్నట్టుగా ఉంది. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ లేట్ అయింది లేదా క్యాన్సిల్ అయింది అన్న విషయం ఇన్ని రోజుల వరకూ నిఖిల్ కు తెలియదా..? లేక తెలిసినా మౌనంగా ఉండేందుకు ఎవరైనా ప్రెజర్ చేశారా..? ఏదో చెప్పాలని ఇంకేదో చెప్పినట్టుగా ఉంది తప్ప.. ప్రాపర్ గా మెన్షన్ చేయలేకపోయాడు అనిపిస్తోంది. లేకపోతే నిఖిల్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఓ రేంజ్ క్యూరియాసిటీతో చూసేంత సీన్ ఉందా..? ఆ మొత్తం ఆడియన్స్ కు ఇలా సారీ చెప్పడానికి..?

Related Posts