అట్లీ వర్సెస్ బోయపాటి

అట్లీ వర్సెస్ బోయపాటి.. ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉన్న మేటర్ ఇదే. ఎందుకంటే ఒక హీరో కోసం ఈ ఇద్దరూ ఫైట్ చేసుకుంటున్నారు. ఇద్దరూ ఆ హీరోకు కథలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సదరు హీరో మాత్రం ఈ ఇద్దరి సినిమాలూ విడుదలైన తర్వాత చూద్దాం అనే కోణంలో ఉన్నాడు. మరి ఆ హీరో ఎవరో తెలుసు కదా..

యస్ అల్లు అర్జున్. పుష్ప 1 కు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న ఐకన్ స్టార్ కు కథ చెప్పేందుకు ఈ దర్శకులిద్దరూ పోటీ పడుతున్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం అట్లీ డైరెక్ట్ చేసిన జవాన్ రిజల్ట్ కోసం చూస్తున్నాడు.

షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన జవాన్ ఈ నెల 7న విడుదల కాబోతోంది. ఈ మూవీ ట్రైలర్ కు దేశవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా రికార్డులు మొదలవుతున్నాయి. అంచనాలున్న సినిమాలన్నీ ఆడతాయనే గ్యారెంటీ లేదు కదా.. అందుకే కంప్లీట్ రిజల్ట్ కోసం చూస్తున్నాడు అల్లు అర్జున్.


ఇక సరైనోడు మూవీతో అల్లు అర్జున్ ను ఫస్ట్ టైమ్ వంద కోట్ల క్లబ్ లో చేర్చిన బోయపాటి శ్రీను కూడా నెక్ట్స్ ప్రాజెక్ట్ ను అతనితో చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాడు. పైగా బోయపాటి డేట్స్ అల్లు అరవింద్ దగ్గర ఉన్నాయి కూడా. అందుకే అతను కూడా ఐకన్ స్టార్ కు కథ చెప్పాలని తాపత్రయపడుతున్నాడు. సరైనోడు అల్లు అర్జున్ కెరీర్ లో అప్పట్లో ఆల్ టైమ్ హయ్యొస్ట్ గ్రాసర్. డౌటే లేదు. కానీ కంటెంట్ పరంగా చూస్తే అవుట్ డేటెడ్ అనే టాక్ కూడా వచ్చింది.

బట్ బోయపాటి మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో కమర్షియల్ గా ప్రాఫిట్స్ తెచ్చుకుంది. అందుకే మరోసారి తనదైన మాస్ మూవీతో అల్లు అర్జున్ ను మరోసారి ఊరమాస్ హీరోగా చూపించాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇక్కడా అంతే. ముందు స్కంద విడుదలైతే దాన్ని బట్టి అల్లు అర్జున్ అసలు బోయపాటి కథ వినాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటాడట. అసలే ఇప్పుడు అతనికి ప్యాన్ ఇండియన్ మార్కెట్ క్రియేట్ అయింది.

దీనికి తోడు నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ కూడా వచ్చింది. ఈ క్రమంలో ఎలాంటి కథలు పడితే అలాంటి కథలు సెలెక్ట్ చేసుకోకూడదు. ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలాంటి కథలకే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. అందుకే ఈ ఇద్దరూ చెప్పే కథలను ప్రస్తుతం వారి సినిమాల రిజల్ట్స్ వరకూ హోల్డ్ లో పెట్టాడట.


విశేషం ఏంటంటే.. అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ ఆల్రెడీ అనౌన్స్ అయి ఉంది. పుష్ప2 తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో నాలుగో సినిమా చేయబోతున్నాడు. అంటే ఈ ఇద్దరు దర్శకుల్లో ఎవరికి అవకాశం ఇచ్చినా.. అది 2024 చివర్లో లేదా 2025లోనే స్టార్ట్ అవుతుంది. అయినా ఐకన్ స్టార్ అంటే టాప్ హీరో కదా.. అందుకే ఇప్పటి నుంచే వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ ఇద్దరిలో ఆ చాన్స్ ఎవరు కొట్టేస్తారో చూడాలి

Related Posts