బిగ్ బాస్ లో అప్పుడే రచ్చ మొదలైంది

ఇండియాస్ టాప్ రియాలిటీ షో తెలుగులోనూ తిరుగులేని ఆదరణ దక్కించుకుంది. అయితే గత రెండు సీజన్స్ ఆశించినంతగా ఆకట్టుకోలేదు. అందుకే ఈ సారి డోస్ పెంచారు. ఊహించని కంటెంస్టెంట్స్ తో షో మొదలైంది.

మామూలుగా ఈ షో స్టార్ట్ అయిన వారం రోజులకు కానీ హీట్ స్టార్ట్ కాదు. బట్ ఈ సారి రెండో రోజుకే స్టార్ట్ అయినట్టు కనిపిస్తోంది. ఇవాళ్టి ప్రోమో చూస్తే ఈ సారి బిగ్ బాస్ నిజంగానే మామూలుగా ఉండదు అనిపిస్తుంది.

ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్ లో మోనిత పాత్రలో కనిపించిన శోభాశెట్టి డే వన్ నుంచే డామినేషన్ షురూ చేసింది. బిగ్ బాస్ లో గ్రూపులు, గొడవలు కామన్. కానీ గ్రూపుల కంటే ముందే గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఎవరి క్యాంప్ లో ఎవరు అనే ప్రశ్నలకు ఆన్సర్స్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ కూడా చాలా హాట్ హాట్ గా మొదలైంది.

కేవలం భాష తెలియదు అనే కారణంతో శోభ.. కిరణ్ రాథోడ్ ను నామినేట్ చేసింది. ఇక దామిని భట్ల అయితే శోభను నామినేట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు అప్పుడే వీరి మధ్య ఎంత వైరం స్టార్ట్ అయిందో చెప్పకనే చెబుతున్నాయి. ఆ తర్వాత వీరి మధ్య సంభాషణ కూడా వైరాన్ని చూపిస్తుంది. ప్రిన్స్ అనే కుర్రాడు కూడా షకీలాను నామినేట్ చేస్తూ.. చెప్పిన డైలాగ్స్ వాటికి షకీలా ఆన్సర్ కూడా హాట్ గానే ఉంది. ఇద్దరూ ఒకే రీజన్ తో నామినేట్ చేసుకున్నారు..రతిక, ఆట సందీప్ మధ్య కూడా సంభాషణ స్ట్రాంగ్ గానే ఉంది. వందసార్లు అడిగి ఆన్సర్ రానప్పుడు అది నెగ్లిజెన్సీ కాదు.. ఇది మాత్రం నెగ్లీజెన్స్ అంటూ రతిక ఆట సందీప్ పై ఫైర్ అయింది.

ఎలా చూసినా బిగ్ బాస్ ఈ సారి ఊహించిన దానికంటే ఎక్కువ ఫైర్ తో కనిపిస్తుంది. ఈ ఫైర్ కు సెంటర్ పాయింట్ గా ఇప్పటికే శోభ రిజిస్టర్ అయింది. మరి ఈ ఫైర్ కొన్నాళ్ల పాటు ఉంటుందా.. లేక మధ్యలోనే ఆగిపోతుందా అనేది చెప్పలేం కానీ.. ఈ లేటెస్ట్ ప్రోమో మాత్రం ఎపిసోడ్ పై మంచి క్యూరియాసిటీనే క్రియేట్ చేసిందని చెప్పాలి.

Related Posts