‘హరిహర వీరమల్లు’ నుంచి క్రేజీ అప్డేట్.. రెండో భాగం కూడా ఉంటుందన్న నిర్మాత

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి కాస్ట్యూమ్ డ్రామాలో కనిపించబోతున్న చిత్రం ‘హరిహర వీరమల్లు‘. చారిత్రక అంశాల మేళవింపుతో.. ఫిక్షనల్ స్టోరీగా ఈ చిత్రాన్ని విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చాలాభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా షూటింగ్ కి గ్యాప్ వచ్చింది. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో బిజీగా ఉండడంతో ‘హరిహర వీరమల్లు‘కి విరామం ఇచ్చాడు. అయితే.. ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. అవన్నింటినీ తాజాగా ఖండించారు నిర్మాత ఎ.ఎమ్.రత్నం.

పవన్ కళ్యాణ్ కి ‘ఖుషి’ వంటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అందించిన ఎ.ఎమ్.రత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ‘హరిహర వీరమల్లు‘ని మొదలుపెట్టారు. అయితే..‘పవన్‌ కల్యాణ్‌ తో సినిమా తీసి డబ్బులు సంపాదించుకోవాలంటే 20 రోజులు ఆయన డేట్స్‌ తీసుకొని ఏదో ఒకటి తీయెచ్చని.. కానీ ఆయనతో తీసే సినిమా ఎప్పటికీ గుర్తుండిపోవాలి. ఆయనకు మంచి పేరు రావాలి. ఈ చిత్రం ఆగిపోయిందంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అందులో వాస్తవం లేదు. దాన్ని నమ్మకండి. ‘హరిహర వీరమల్లు’ ఆగిపోలేదు‘ అన్నారు ఎ.ఎమ్.రత్నం.

అలాగే ‘హరిహర వీరమల్లు’కి రెండో భాగం కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు నిర్మాత ఎ.ఎమ్.రత్నం. మరోవైపు ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తవుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి బ్యాలెన్స్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారట.

Related Posts