ప్రభాస్ సినిమాలో మరో హీరో

ప్రభాస్ సినిమా అంటే ఒన్ మేన్ షో గానే ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తాం. ఒకప్పుడు అంటే ఏమో కానీ ఇప్పుడు మాత్రం అలాగే. ప్రభాస్ ఉంటే చాలు అని భావిస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఇప్పుడు ఓ రేంజ్ దూకుడుతో ఉన్నాడు ప్రభాస్.

సెప్టెంబర్ 28న ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన సలార్ విడుదల కాబోతోంది. ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ నెలాఖరు నుంచి ప్రమోషనల్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. అటు కల్కి షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీ తర్వాత మారుతి సినిమా ఉంటుంది. మొదట్లో రాజా డీలక్స్ అనే వర్కింగ్ టైటిల్ వినిపించినా.. అది కాదు. ‘రాయల్’ అనీ లేదా ‘అంబాసిడర్’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. వీటిలో రాయల్ ఫైనల్ కావొచ్చు.


ఇక ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు మరో లీడ్ యాక్టర్ అవసరం ఉందట. అంటే మరో హీరో. అలాగని మరీ పెద్ద రేంజ్ ఉండొద్దు అనుకుంటున్నారు. ఈ పాత్ర చేసే నటుడి కోసం చూస్తున్నాడు మారుతి. మూవీ టీమ్ మాత్రం నవీన్ పోలిశెట్టి అయితే బెటర్ అని భావిస్తున్నారట. అతను కాదంటే రాజ్ తరుణ్‌ ను కూడా అప్రోచ్ కావాలనుకుంటున్నట్టు సమాచారం.

నవీన్ పోలిశెట్టి అంటే కథలో కొన్ని మార్పులు అవసరం అవుతాయి. రాజ్ తరుణ్ ఛాన్స్ వస్తే అతను జాక్ పాట్ కొట్టినట్టే. వీళ్లు కాక ఇంకా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో కూడా చూస్తున్నాడట మారుతి. విశేషం ఏంటంటే.. ఈ రెండో హీరో పాత్ర సినిమాలో మంచి ఎంటర్టైనింగ్ గా ఉంటుందట. అందుకే నవీన్ పోలిశెట్టి బెటర్ అనుకుంటున్నారు. మరి అతను ఒప్పుకుంటాడా లేదా అనేది తెలియదు కానీ.. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Related Posts