గాండీవధారి ఏజెంట్ కాదు స్పై కాదు..

నాలుగు గన్స్, స్టైలిష్ లుక్, శతృదేశాలపై దాడి అనగానే వెంటనే మనకు ఏజెంట్‌స్ గుర్తొస్తారు. రా ఏజెంట్ అనో లేక గూఢచారిగానో నటిస్తున్నారు అనే ఫిక్స్ అయిపోతాం. ఈ నెల 25న విడుదల కాబోతోన్న వరుణ్ తేజ్ – ప్రవీణ్ సత్తారుల గాండీవధారి అర్జున సినిమా కూడా అలాంటిదే అనుకున్నారు. ట్రైలర్ రాగానే జనమంతా వరుణ్ తేజ్ కూడా ఏజెంట్ గా నటిస్తున్నాడు అనుకున్నారు.

అయితే రీసెంట్ గా వచ్చిన ఓ ఏజెంట్ ప్రేక్షకులకు గట్టి షాకే ఇవ్వడంతో ఈ మూవీ కూడా అలాగే ఉంటుందా అనే ఆరాలు మొదలయ్యాయి. కానీ ఈ సినిమా ఏజెంట్ మూవీ కాదు అని స్పష్టం చేశాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. స్పై కూడా కాదని క్లారిటీ ఇచ్చాడు. మరి ట్రైలర్ లో చూపించింది ఏంటీ అంటే.. మనకు ఒకప్పటి హాలీవుడ్ మూవీస్ లో రకరకాల ఏజెన్సీలు కనిపిస్తాయి. ఎవరికి వారు ఓ పేరు పెట్టుకుని కిరాయికి రక్షణ ఇస్తుంటారు. అంటే వీళ్లు ఏజెంట్లు కాదు కానీ తాము కమిట్ అయిన మిషన్స్ ను మాత్రం ఏజెంట్స్ కు మించిన కమిట్మెంట్ తో పూర్తి చేస్తుంటారు. అలాంటి ఓ ఏజెన్సీలోనే వరుణ్ పనిచేస్తుంటాడట. ఆ ఏజెన్సీ పేరు ఎస్సే అంటున్నాడు ప్రవీణ్ సత్తారు.


ఎస్సే (ESSAY – Elite Security Services Agency) అనే ఏజెన్సీలో ఉంటాడు వరుణ్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలుకుబడి ఉన్న వ్యక్తులకు బాడీగార్డ్స్ గా పనిచేస్తుంటారు వీళ్లు. వీళ్లు చంపడానికి, చావడానికి ఏ మాత్రం ఆలోచించరు. ఈ ఏజెన్సీలో ఉండేవాళ్లంతా ఆర్మీ నుంచి ట్రెయినింగ్ అయిన వాళ్లే ఉంటారట. అంటే దేశభక్తి కూడా ఉంటుంది వారికి. ఇలాంటివి హాలీవుడ్ యాక్షన్ మూవీస్ లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఓ రకంగా ఫస్ట్ టైమ్ తెలుగులో చూపించబోతున్నాడు ప్రవీణ్ సత్తారు. మరి ఈ ఏజెన్సీ యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉంటుందో కానీ.. ప్రతిసారీ కొత్త జానర్ తో ఆకట్టుకునే ప్రవీణ్ సత్తారు ‘కంటెంట్ పికప్’ కు మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Related Posts