ఆనంద్ దేవరకొండ బర్త్‌డే స్పెషల్ – డ్యూయెట్‌ ఫస్ట్‌లుక్‌

స్టూడియో గ్రీన్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న చిత్రం ‘డ్యూయెట్‘ ఈ మూవీతో మధుర వరదకృష్ణరాజన్‌ డైరెక్టర్‌ గా డెబ్యూ ఇస్తున్నారు. ఆనంద్ దేవరకొండ, రితిక నాయక్‌ జంటగా నటిస్తోంది. ఈరోజు (మార్చి 15) న ఆనంద్ దేవరకొండ బర్త్‌డే కావడంతో ఈ సినిమాలో ఆయన నటిస్తున్న మదన్ క్యారెక్టర్ లుక్ ను రిలీజ్ చేశారు.

త్వరలోనే “డ్యూయెట్” సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. ఓ డిఫరెంట్ ప్రేమ కథగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించేలా “డ్యూయెట్” సినిమాను రూపొందిస్తున్నారు.

Related Posts