గ్యాంగ్ స్టర్ మూవీలో విజయ్ దేవరకొండ

చేస్తోన్న సినిమాలను గురించి బయటకు చెప్పకూడదు అనే అనధికార నియమం ఉంటుంది. అప్పుడప్పుడూ తెలియకుండా అవి లీక్ అవుతుంటాయి. వీటికి మెగాస్టార్ ఆద్యుడు అని చెప్పలేం కానీ ఆయన చేయడం వల్ల కొన్ని చిరు లీక్స్ గా మారాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా అదే చేశాడా అన్నట్టుగా టంగ్ స్లప్ అయ్యాడు.లేటెస్ట్ గా దుల్కర్ సాల్మన్ – విజయ్ దేవరకొండ కలిసి తమ సినిమాలకు సంబంధించిన విశేషాలను షేర్ చేసుకున్నారు.

ఒక రకంగా రెగ్యులర్ ఇంటర్వ్యూస్ లా కాకుండా.. దుల్కర్ కింగ్ ఆఫ్ కోతా గురించి విజయ్ దేవరకొండ ఖుషీ సినిమా విశేషాలను ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు.ఇలా ఇంతకు ముందు కూడా జరిగింది. బట్ ఈ ఇద్దరు స్టార్స్ కు క్రేజ్ వల్ల ఈ ఇంటర్వ్యూ కూడా కొత్తగా ఉందనే చెప్పాలి.


అయితే వీళ్లిద్దరూ ఈ రెండు సినిమాల గురించే కాక ఇండియన్ మూవీస్, ఇంటర్నేషనల్ స్థాయిలో మన సినిమాలు, ఆర్టిస్టులు ఎదగాలంటూ మాట్లాడుకున్న మాటలు ఆకట్టుకుంటున్నాయి.ఈ సందర్భంలో విజయ్ దేవరకొండ సడెన్ గా తను చేస్తోన్న ఓ సినిమా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో ఉంది అని చెప్పాడు. అదేదో కాదు.. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో నటిస్తోన్న సినిమాలో అతను రా ఏజెంట్ అని చాలామంది అనుకున్నారు. బట్ విజయ్ మాత్రం గౌతమ్ చేస్తున్న సినిమా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని చెప్పాడు.

అంటే అతను గ్యాంగ్ స్టరా లేక రా ఏజెంట్ గా గ్యాంగ్స్ స్టర్స్ ను అంతం చేస్తాడా అనేది చెప్పలేదు. బట్ ఈ మూవీ బ్యాక్ డ్రాప్ మాత్రం గ్యాంగ్ స్టర్స్. సో.. విజయ్ దేవరకొండ నుంచి ఖుషీ, ఫ్యామిలీ మేన్(పరశురామ్ తో చేస్తోన్న సినిమా వర్కింగ్ టైటిల్) వంటి సాఫ్ట్ మూవీస్ తర్వాత ఈ గ్యాంగ్ స్టర్ మాస్ మూవీ వస్తుందన్నమాట. మరి దీనికి విజయ్ లీక్స్ అనే పేరు పెట్టొచ్చా.. లేక ఇంకో రెండు మూడు లీక్స్ వచ్చిన తర్వాత అందామా.. ?

Related Posts