అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో బిగ్గెస్ట్ రికార్డ్‌ – ఒకేరోజు 40 వెబ్‌సిరీస్‌లు, సినిమాలు

అమెజాన్ ప్రైమ్‌ వీడియో సంచలనం సృష్టించింది. ఒకేరోజు 40 వెబ్‌సిరీస్లు, సినిమాలను ప్రకటించింది. దీనికి సంబంధించిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ అందరినీ ఒకే వేదికపై తెచ్చింది. ఇలాంటి ప్రయత్నం ఓటీటీ వరల్డ్ లో ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు. మొట్టమొదటిసారి ఇన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లను అనౌన్స్‌ చేసి సంచలనం సృష్టించింది. రెండేళ్ల పాటు ప్రీమియర్ అవుతాయని తెలుస్తోంది. హిందీ , తెలుగు , తమిళ్‌తో పాటు అనేక భారతీయ భాషల్లో ఈ చలన చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు అందుబాటులో ఉండనున్నాయి. కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్, హర్రర్, థ్రిల్లర్, యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌తో ప్రతీ ఇంటికి వినోదాన్ని తీసుకొచ్చింది అమెజాన్ ప్రైమ్‌ వీడియో.


అత్యుత్తమ వినోదంతో భారతీయ సబ్‌స్క్రైబర్స్‌కు అద్భుతమైన సేవలందించేందుకు మేం నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ప్రైమ్‌ వీడియో ఇండియా డైరెక్టర్‌ . ప్రతీ కస్టమర్‌ వినోదం కోసం మొదటి చాయిస్ అమెజాన్ ప్రైమ్‌ వీడియోదే అయ్యేలా ఉండటమే మా లక్ష్యం అన్నారాయన. మా రాబోయే సిరీస్‌లు మరియు చలనచిత్రాలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా కొనసాగుతాయని నిశ్చయించుకున్నామన్నారు.


భారతీయ మూలాలను సంస్కృతి సంప్రదాయాలను చాటే సినిమాలకు, ప్రతిభావంతులకు అమెజాన్ ప్రైమ్‌ వీడియో గొప్ప వేదిక అన్నారు ప్రైమ్‌ వీడియో ఒరిజినల్స్ హెడ్‌ అపర్ణ. 2023 లో ప్రైమ్‌ వీడియో అద్భుతమైన విజయాలు సాధించిందని లెక్కలతో సహా చెప్పారామె. మా రాబోయే సిరీస్ మరియు చలనచిత్రాలు భారతదేశం నుండి మరింత ఆకట్టుకునే కథనాలు వెలువడేందుకు మార్గం సుగమం చేస్తాయని మేము విశ్వసిస్తున్నామన్నారు.

Related Posts