వరుణ్ – లావణ్య జంటకు అల్లు అర్జున్ గిఫ్ట్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి వివాహానికి ఇంకా కేవలం 15 రోజులు మాత్రమే ఉంది. నవంబర్ 1న ఈ జంట పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు.

ఇప్పటికే ఈ క్యూట్ కపుల్ కోసం మెగాస్టా చిరంజీవి గ్రాండ్ లెవెల్ లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా వరుణ్-లావణ్య ల కోసం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించాడు.

ఆమధ్య జరిగిన మెగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో మిస్సైన బన్నీ.. లేటెస్ట్ గా వరుణ్, లావణ్య జంట కోసం ప్రత్యేకంగా ఓ ఫంక్షన్ ఏర్పాటు చేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు వరుణ్ తేజ్.

ఈ సెలబ్రేషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి దంపతులు, అల్లు అరవింద్ దంపతులతో పాటు.. సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్.. మెగా డాటర్స్ అంతా సందడి చేశారు. మరోవైపు జాతీయ అవార్డుల వేడుకలో పాల్గొనేందుకు అల్లు అర్జున్ సతీసమేతంగా ఢిల్లీ పయనమయ్యాడు.

Related Posts