‘వృషభ‘ సెట్స్ లో సంజయ్ కపూర్ సందడి

కపూర్స్ అనగానే బాలీవుడ్ ముందుగా గుర్తుకొస్తుంది. రాజ్ కపూర్ ఫ్యామిలీ కాకుండా బాలీవుడ్ లో పాగా వేసిన మరో కపూర్ వంశం.. బోనీ కపూర్, అనిల్ కపూర్, సంజయ్ కపూర్ లది. రాజ్ కపూర్ వంశానికి బంధువర్గమైన ఈ కపూర్లలో బోనీ కపూర్ నిర్మాతగా దూసుకెళ్తే.. అనిల్ కపూర్, సంజయ్ కపూర్ హీరోలుగా అలరించారు. ప్రస్తుతం వీరి తర్వాతి తరం ఒక్కొక్కరిగా ఇండస్ట్రీలోకి వస్తున్నారు.

బోనీ కపూర్ తనయుడు అర్జున్ కపూర్ హీరోగా.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇప్పటికే బాలీవుడ్ లో కొనసాగుతున్నారు. అనిల్ కపూర్ తనయ సోనమ్ కపూర్ హీరోయిన్ గా నటించి పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. అనిల్ తనయుడు హర్షవర్థన్ కపూర్ కూడా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు సంజయ్ కపూర్ తనయ శనయ కపూర్ హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతోంది.

మోహన్ లాల్, శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోలుగా రూపొందుతోన్న ‘వృషభ‘ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమవుతోంది శనయ కపూర్. ఈ సినిమాలో రోషన్ కి జోడీగా శనయ కనిపించబోతుంది. పీరియాడక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ‘వృషభ‘ చిత్రం ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా.. ఈ మూవీ సెట్స్ ను సందర్శించారు సంజయ్ కపూర్, అతని భార్య మహీప్ కపూర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Related Posts