‘శశివదనే’ నుంచి గోదారి సాంగ్ రిలీజ్‌

గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్న మూవీ ‘శశివదనే’. ఈ సినిమాలో ‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి కోమలీ ప్రసాద్ హీరో హీరోయిన్లు. ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వ‌హించారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 19న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.

రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. మూవీ టైటిల్ సాంగ్ ‘శశివదనే..’, ‘డీజే పిల్లా..’ అనే సాంగ్‌కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి ‘గోదారి అటు వైపో…’ పాటను మేకర్స్ విడుదల చేశారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తూ పాడిన ఈ పాటను కిట్టు విస్సా ప్రగడ రాశారు.శరవణన్ వాసుదేవన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. శ్రీసాయికుమార్ దారా సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా గ్యారీ బి.హెచ్ వర్క్ చేస్తున్నారు.

Related Posts