టాలీవుడ్

‘బచ్చల మల్లి’గా మాస్ అవతార్ లో అల్లరి నరేష్

కొన్నాళ్లుగా కామెడీని పక్కనపెట్టి సీరియర్ రోల్స్ పై ఫోకస్ పెట్టాడు అల్లరి నరేష్. ‘నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం’ వంటి మూవీస్ ఈకోవలో వచ్చినవే. లేటెస్ట్ గా మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. ఈసారి ‘బచ్చల మల్లి’ అనే రియల్ స్టోరీతో రాబోతున్నాడు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

గోదావరి ప్రాంతంలోని ఓ నిజజీవిత రౌడీ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. పీరియాడిక్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాలో నరేష్ కి జోడీగా అమృత అయ్యర్ నటిస్తుంది. ఇతర కీలక పాత్రల్లో రావు రమేశ్, హరితేజ, ప్రవీణ్ కనిపించనున్నారు. హాస్యా మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. లేటెస్ట్ గా ‘బచ్చల మల్లి’ మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ లో అల్లరి నరేష్‌ మాస్ అవతార్ లో మెప్పిస్తున్నాడు. రేపు అల్లరి నరేష్ బర్త్ డే స్పెషల్ గా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రాబోతుంది.

Telugu70mm

Recent Posts

పాన్ ఇండియా లెవెల్ లో సుధీర్ బాబు కొత్త చిత్రం

తెలుగు కథానాయకుల్లో అసలు సిసలు యాక్షన్ హీరో అనిపించుకునే క్వాలిటీస్ సుధీర్ బాబు కి పుష్కలంగా ఉన్నాయి. అందుకు ప్రధాన…

7 mins ago

Nabha Natesh

23 mins ago

‘డబుల్ ఇస్మార్ట్‘ నుంచి ‘స్టెప్పామార్‘ వచ్చేసింది

ఉస్తాద్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో రూపొందుతోన్న క్రేజీ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్‘. ‘ఇస్మార్ట్ శంకర్‘కి సీక్వెల్…

45 mins ago

ఆగస్టు 15 రేసులోకి విక్రమ్ ‘తంగలాన్‘

ఈ ఏడాది ప్రథమార్థంలో పెద్ద హీరోలు నటించిన చిత్రాలేవి పెద్దగా రాలేదు. అయితే.. ద్వితియార్థంలో మాత్రం వరుసగా బడా హీరోలంతా…

1 hour ago

ట్రిపుల్ ఫైవ్ నంబర్ కి చేరిన ‘కల్కి‘ కలెక్షన్స్

సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘కల్కి‘ లేటెస్ట్ కలెక్షన్స్ పై క్రేజీ అప్డేట్ వచ్చేసింది. గురువారం విడుదలైన ‘కల్కి‘ సినిమాకి లాంగ్…

2 hours ago

కొత్త సినిమా ప్రారంభించిన బెల్లంకొండ

ప్రస్తుతం బాలీవుడ్ ఆశలు పక్కనపెట్టేసిన బెల్లంకొండ శ్రీనివాస్.. తెలుగు మార్కెట్ పై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈకోవలోనే 'టైసన్…

3 hours ago