‘బచ్చల మల్లి’గా మాస్ అవతార్ లో అల్లరి నరేష్

కొన్నాళ్లుగా కామెడీని పక్కనపెట్టి సీరియర్ రోల్స్ పై ఫోకస్ పెట్టాడు అల్లరి నరేష్. ‘నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం’ వంటి మూవీస్ ఈకోవలో వచ్చినవే. లేటెస్ట్ గా మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. ఈసారి ‘బచ్చల మల్లి’ అనే రియల్ స్టోరీతో రాబోతున్నాడు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

గోదావరి ప్రాంతంలోని ఓ నిజజీవిత రౌడీ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. పీరియాడిక్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాలో నరేష్ కి జోడీగా అమృత అయ్యర్ నటిస్తుంది. ఇతర కీలక పాత్రల్లో రావు రమేశ్, హరితేజ, ప్రవీణ్ కనిపించనున్నారు. హాస్యా మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. లేటెస్ట్ గా ‘బచ్చల మల్లి’ మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ లో అల్లరి నరేష్‌ మాస్ అవతార్ లో మెప్పిస్తున్నాడు. రేపు అల్లరి నరేష్ బర్త్ డే స్పెషల్ గా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రాబోతుంది.

Related Posts