షారుఖ్ ఖాన్ కు యాక్సిడెంట్

బాలీవుడ్ బాద్ షా .. షారుఖ్ ఖాన్ కు ప్రమాదం జరిగింది. అట్లీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘జవాన్’ మూవీలో నటిస్తున్నాడు. అయితే ఈ ప్రమాదం షూటింగ్ లో జరిగింది అని చాలామంది అనుకుంటున్నారు. కానీ కాదు. షారుఖ్ ఖాన్ రీసెంట్ గా యూస్ కు ట్రిప్ కు వెళ్లాడు.

ఆ సందర్భంగానే అనుకోకుండా పడిపోయారట. దీంతో ఓ మైనర్ సర్జరీ కూడా జరగబోతోంది. ఈ సర్జరీని యూడా యూఎస్ లోనే చేయబోతున్నారు. షారుఖ్ ఇప్పుడు 57 యేళ్ల వయసులో ఉన్నాడు. ఈ వయసులో పెద్ద సర్జరీలు అంటే సమస్య. కానీ ఇది మాత్రం చాలా చిన్న సర్జరీయే అంటున్నారు. ఇక ఈ ఆపరేషన్ తర్వాత షారుఖ్ ఇండియాకు తిరిగి వస్తాడు.


ఇక ఇప్పుడు షారుఖ్ నటిస్తోన్న జవాన్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఆల్రెడీ రీసెంట్ గా పఠాన్ తో బాక్సాఫీస్ న షేక్ చేశాడు కాబట్టి..ఆ ప్రభావం జవాన్ పైనా ఉంటుంది. అందుకే భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం అంటుంది ట్రేడ్. తమిళ్ డైరెక్టర్ అట్లీ రూపొందిస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార కీలక పాత్రలో ప్రియమణి నటిస్తున్నారు. విలన్ గా విజయ్ సేతుపతి ఉన్నాడు. చాలా కాలం తర్వాత హిందీలో.. హీరో కాకుండా మిగతా ప్రధాన పాత్రలన్నీ దక్షిణాది వారే చేస్తుండటం విశేషం అనే చెప్పాలి. ఏదేమైనా షారుఖ్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

Related Posts