ఐదు పదుల అందాల ఐశ్వర్యం

భారతదేశానికి అందాల పోటీలలో అద్భుతమైన కిరీటాన్ని అందించిన ఘనత ఐశ్వర్య రాయ్ ది. ఈ మంగళూరు భామ 1994లో ప్రపంచ సుందరిగా ఎంకిపైంది. ఆ తర్వాత 1997లో ‘ఇద్దరు’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఐశ్వర్య.. ‘జీన్స్, హమ్ దిల్ దే చుకే సనమ్, తాల్, మొహబత్తేన్, దేవదాస్, ధూమ్-2, గురు, జోదా అక్బర్, రోబో’ వంటి ఘన విజయాలందుకుంది.

పెళ్లి తర్వాత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోన్న ఈ మాజీ విశ్వసుందరి.. మణిరత్నం ఎపిక్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్‌’లో మెరిసింది. ఈ మూవీ సిరీస్ లో నందిని, మందాకిని దేవి గా రెండు పాత్రల్లో తన విలక్షణతను చాటుకుంది. రెండున్నర దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతోన్న ఐశ్వర్య రాయ్ తో తెలుగు సినిమా చేయించాలని దర్శకనిర్మాతలు చాలా తాపత్రయపడ్డారు. అయితే తెలుగులో హీరోయిన్ గా నటించలేదు కానీ.. నాగార్జున ‘రావోయి చందమామ’లో స్పెషల్ సాంగ్ లో కనిపించింది.

మొత్తంమీద.. ఇప్పటికైనా తెలుగులో ఈ అందాల ఐశ్వర్యం ఫుల్ లెన్త్ మూవీ చేస్తుందని ఆకాంక్షిస్తూ.. నేటితో 50 ఏళ్లు పూర్తిచేసుకుంటోన్న ఈ అందాల ఐశ్వర్యానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదాం.

Related Posts