షారుక్ ఖాన్ బర్త్ డే గిఫ్ట్ అదిరింది

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు. ఈ ఏడాది ప్రథమార్థంలో ‘పఠాన్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న షారుక్.. ద్వితియార్థంలో ‘జవాన్’తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాడు. కేవలం హిందీ భాషలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో కూడా ‘జవాన్’కి మంచి ఆదరణ దక్కింది. అట్లీ డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లు కలెక్షన్లను కొల్లగొట్టింది. థియేటర్లలో దుమ్మురేపిన ‘జవాన్’ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

షారుక్ ఖాన్ బర్త్ డే స్పెషల్ గా రేపటి నుంచే ‘జవాన్’ ఓటీటీలో సందడి చేయబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ‘జవాన్’ అందుబాటులోకి రాబోతుంది. థియేటర్లలోనే భారీ నిడివితో వచ్చిన ‘జవాన్’ ఇప్పుడు మరిన్ని అదనపు సన్నివేశాలతో ఓటీటీ లోకి వస్తోంది.

షారుక్ తన రెడ్ ఛిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ‘జవాన్’ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, సాన్య మల్హోత్రా, యోగిబాబు వంటి తారాగణం నటించింది. స్పెషల్ రోల్ లో దీపిక పదుకొనె కూడా కనిపించింది. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ‘జవాన్’ విజయంలో మరో కీలక భూమిక పోషించాయి.

Related Posts