గోవా బ్యూటీ మళ్లీ మురిపించేనా?

తక్కువ సమయంలోనే తెలుగులో టాప్ రేంజ్ కు చేరుకుంది గోవా బ్యూటీ ఇలియానా. ‘పోకిరి, జల్సా, కిక్, జులాయి’ వంటి చిత్రాలు ఘన విజయాలు సాధించి.. ఇలియానాని టాలీవుడ్ లో స్థిరపరిచాయి. ఆరేళ్లపాటు తెలుగులో అగ్ర కథానాయకులెందరినో కవర్ చేసిన ఇలియానా అంటే ముందుగా గుర్తొచ్చేది నాజూకు నడుమందాలు. తన హిప్ అందాలతో.. బెల్లీ డాన్సులతో కుర్రకారును ఎంతగానో కైపెక్కించింది ఈ గోవా బ్యూటీ. అందుకే.. అగ్ర దర్శకుడు శంకర్ తన ‘స్నేహితుడు’ చిత్రంలో ఇలియానా నడుమందాలపైనే ఏకంగా ఓ పాట పెట్టేశాడు.

ఇక్కడ కెరీర్ పీక్స్ లో ఉండగానే.. ‘బర్ఫీ’ సినిమాతో బాలీవుడ్ కు చెక్కేసింది. ‘బర్ఫీ’ భారీ విజయం సాధించడంతో బీటౌన్ లో తన కెరీర్ సజావుగా సాగుతోందని భావించిన ఇల్లీ బేబ్ కు.. అక్కడ ఆశించిన ఆఫర్లు రాలేదు. ఇలియానా నటించిన ‘మే తేరా హీరో, రుస్తోం, రెయిడ్’ వంటి చిత్రాలు విజయాలు సాధించినా.. ఆ క్రెడిట్ అంతా హీరోలే కొట్టేశారు. దీంతో.. మళ్లీ తనకు బాగా కలిసొచ్చిన టాలీవుడ్ కే యు-టర్న్ తీసుకుంది. టాలీవుడ్ లో లాంగ్ గ్యాప్ తర్వాత ‘అమర్ అక్బర్ ఆంటోని’లో నటించింది. అయినా.. ఈ సినిమా ఇలియానాకి బ్రేక్ ఇవ్వలేకపోయింది.

‘అమర్ అక్బర్ ఆంటోని’ సమయానికే ఇలియానా బాగా షేప్ అవుట్ అయిపోయింది. ఆస్ట్రేలియన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూతో బ్రేకప్ అవ్వడం వంటి పర్సనల్ రీజన్స్ తోనూ.. ఫిట్ నెస్ పై సరిగా ఫోకస్ పెట్టలేదనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఆ తర్వాత సినిమాలకు కామా పెట్టేసి పర్సనల్ లైఫ్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా మరో ప్రియుడు మైఖేల్ డోలన్ ని వివాహం చేసుకుందట. ఈ ఏడాది ఆగస్టులో కుమారిడికి జన్మనిచ్చింది. నవంబర్ 1న, ఇలియానా పుట్టినరోజు. మొత్తానికి.. గోవా బ్యూటీ ఇలియానా మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని మురిపిస్తుందేమో చూడాలి.

Related Posts