తెలుగువారి ఆస్తి రాజమౌళి..
రాజమౌళి.. తెలుగు చిత్ర పరిశ్రమంతా ఈ దర్శకుడు మావాడు అని సగర్వంగా చెప్పుకునే స్టార్ డైరక్టర్. ఊహాకు అందనిరీతిలో సినిమాను రూపోందించి.. సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త వండర్ ను క్రియేట్ చేయండం ఈ డైరెక్టర్ స్పెషాలిటీ. సినిమా సినిమాకు ఆకాశాన్నంటే అంచనాలున్నా.. ప్రేక్షకుల్లో క్లాస్ మాస్ అని తేడాలేకుండా ప్రతిఒక్కరిని ఎంటర్ టైన్ చేయగల సత్తా ఉన్న గ్రేట్ డైరక్టర్ రాజమౌళి. అక్టోబర్ 10, రాజమౌళి పుట్టినరోజు.
అపజయమెరుగని దర్శకధీరుడు..
తెలుగు చిత్ర పరిశ్రమలో అపజయమెరుగని దర్శకధీరుడు రాజమౌళి. ‘స్టూడెంట్ నెం.1’ నుంచి ‘ఆర్.ఆర్.ఆర్’ వరకూ జక్కన్న తీసిన చిత్రాలన్నీ.. ఒకటికి మించి మరొకటి విజయాలు సాధించాయి. రెండు దశాబ్దాలకు పైగా చిత్ర సీమలో కొనసాగుతున్న జక్కన్న తీసినవి కేవలం 12 చిత్రాలు మాత్రమే. కథానాయకుల మాస్ ఇమేజ్ అమాంతం పెంచడంలో సిద్ధహస్తుడు రాజమౌళి. ఇక.. దర్శకధీరుడు సినిమాలంటేనే యాక్షన్ ను పీక్స్ లో చూపిస్తుంటాడు. ఒళ్లు గగుర్పొడిచే భీకరమైన యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించడంలో జక్కన్నది అందవేసిన చేయి. అందుకే.. ఓ చిన్న సైజు సినిమా చిత్రీకరించే సమయాన్ని.. ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం తీసుకుంటాడు రాజమౌళి.
రాజమౌళి అంటే ఒక బ్రాండ్..
దర్శకధీరుడు రాజమౌళి అంటే ఇప్పుడో బ్రాండ్. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఇప్పుడు ప్రపంచ సినీ ప్రేమికులను తనవైపు తిప్పుకునేలా చేసుకున్నాడు దర్శకధీరుడు. ఇక.. తెలుగు చిత్ర పరిశ్రమను కేవలం రీజనల్ ఇండస్ట్రీగానే గుర్తించిన బాలీవుడ్ కు ‘బాహుబలి’ సిరీస్, ‘ఆర్.ఆర్.ఆర్‘ చిత్రాలతో పెద్ద షాకిచ్చాడు. ‘బాహుబలి’ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా 2400 కోట్లు కొల్లగొట్టింది. ఇండియన్ సినీ హిస్టరీలోనే ఇదొక రికార్డు. గతంలో హిందీ చిత్ర సీమను ‘షోలే’కి ముందు.. ‘షోలే’ తర్వాత అనేవారు. అయితే.. ఇప్పుడు బాలీవుడ్ ని ‘బాహుబలి’కి ముందు.. ‘బాహుబలి’ తర్వాత అనాల్సి వస్తోంది. అది కేవలం బాలీవుడ్ కే పరిమితం కాదు.. ఇండియాలోని ప్రతీ సినీ ఇండస్ట్రీ ‘బాహుబలి’ తర్వాత తమ ఆలోచన ధోరణులు మార్చుకుందనే చెప్పాలి.
ఇండియా మూవీస్ కి ప్రేరణ..
‘బాహుబలి’ చిత్రం టాలీవుడ్ టు బాలీవుడ్ వరకూ ఫిల్మ్ మేకర్స్ ఆలోచనా తీరును మార్చేసింది. ప్రస్తుతం సౌత్ నుంచి పలు పాన్ ఇండియా రేంజ్ మూవీస్ రూపొందుతున్నాయంటే దానికి ‘బాహుబలి’ సినిమాయే ప్రేరణ. అలాగే.. బాలీవుడ్ లో ఇప్పుడు పదుల సంఖ్యలో రూపొందుతోన్న బడా బడ్జెట్ చిత్రాలకు కూడా పరోక్షంగా ‘బాహుబలి’ సినిమాయే కారణం.
ఆస్కార కల సాకారం చేసిన ‘ఆర్.ఆర్.ఆర్’..
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్.ఆర్.ఆర్‘ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు దశాబ్దాల తర్వాత ఇద్దరు అగ్ర తారలతో క్రేజీ మల్టీస్టారర్ గా ‘ఆర్.ఆర్.ఆర్‘ను తెరకెక్కించాడు రాజమౌళి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కలెక్షన్ల రికార్డులు నెలకొల్పిన ఈ క్రేజీ మల్టీస్టారర్ జాతీయ, అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకుంది. అందులో వరల్డ్స్ ప్రెజ్టేజియస్ గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ వంటి అవార్డులు కూడా ఉన్నాయి.
మహేష్ కోసం పాన్ వరల్డ్ స్టోరీ..
‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఒక సినిమా చేయబోతున్నాడు రాజమౌళి. ఇప్పటివరకూ పాన్ ఇండియా మార్కెట్ కు కనెక్ట్ అయ్యే కథాంశాలనే ఎంచుకున్న జక్కన్న.. మహేష్ కోసం పాన్ వరల్డ్ కాన్సెప్ట్ ను ఎంచుకున్నాడు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వంచరస్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కించనున్నాడట. వీటితో పాటు రాజమౌళి ఓ హాలీవుడ్ మూవీని కూడా డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్టు రచయిత విజయేంద్రప్రసాద్ తెలిపారు.
లైవ్ యానిమేషన్ డ్రామాగా ఆ హాలీవుడ్ మూవీ తెరకెక్కనుందట. మొత్తంమీద.. ఇప్పటివరకూ అపజయమెరుగని దర్శకుడిగా సంచలనాలు సృష్టిస్తున్న జక్కన్న.. మునుముందు కూడా అత్యద్భుత చిత్ర రాజాలను అందించాలని ఈ దర్శకధీరుడు రాజమౌళికి మరోసారి బర్త్ డే విషెస్ చెబుదాం.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…
Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…
Among the crazy movies coming this year at pan India level is 'Kalki 2898 AD'.…
Not only the first song from 'Devara'.. the second song is also coming as a…
Television actor Chandu's suicide has created a sensation. Serial actress Pavitra died in a car…
Natural Star Nani is on a good streak. He has a string of hits to…