భారతీయ సినిమాపై రాజ ముద్ర

తెలుగువారి ఆస్తి రాజమౌళి..
రాజమౌళి.. తెలుగు చిత్ర పరిశ్రమంతా ఈ దర్శకుడు మావాడు అని సగర్వంగా చెప్పుకునే స్టార్ డైరక్టర్. ఊహాకు అందనిరీతిలో సినిమాను రూపోందించి.. సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త వండర్ ను క్రియేట్ చేయండం ఈ డైరెక్టర్ స్పెషాలిటీ. సినిమా సినిమాకు ఆకాశాన్నంటే అంచనాలున్నా.. ప్రేక్షకుల్లో క్లాస్ మాస్ అని తేడాలేకుండా ప్రతిఒక్కరిని ఎంటర్ టైన్ చేయగల సత్తా ఉన్న గ్రేట్ డైరక్టర్ రాజమౌళి. అక్టోబర్ 10, రాజమౌళి పుట్టినరోజు.

అపజయమెరుగని దర్శకధీరుడు..
తెలుగు చిత్ర పరిశ్రమలో అపజయమెరుగని దర్శకధీరుడు రాజమౌళి. ‘స్టూడెంట్ నెం.1’ నుంచి ‘ఆర్.ఆర్.ఆర్’ వరకూ జక్కన్న తీసిన చిత్రాలన్నీ.. ఒకటికి మించి మరొకటి విజయాలు సాధించాయి. రెండు దశాబ్దాలకు పైగా చిత్ర సీమలో కొనసాగుతున్న జక్కన్న తీసినవి కేవలం 12 చిత్రాలు మాత్రమే. కథానాయకుల మాస్ ఇమేజ్ అమాంతం పెంచడంలో సిద్ధహస్తుడు రాజమౌళి. ఇక.. దర్శకధీరుడు సినిమాలంటేనే యాక్షన్ ను పీక్స్ లో చూపిస్తుంటాడు. ఒళ్లు గగుర్పొడిచే భీకరమైన యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించడంలో జక్కన్నది అందవేసిన చేయి. అందుకే.. ఓ చిన్న సైజు సినిమా చిత్రీకరించే సమయాన్ని.. ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం తీసుకుంటాడు రాజమౌళి.

రాజమౌళి అంటే ఒక బ్రాండ్..
దర్శకధీరుడు రాజమౌళి అంటే ఇప్పుడో బ్రాండ్. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఇప్పుడు ప్రపంచ సినీ ప్రేమికులను తనవైపు తిప్పుకునేలా చేసుకున్నాడు దర్శకధీరుడు. ఇక.. తెలుగు చిత్ర పరిశ్రమను కేవలం రీజనల్ ఇండస్ట్రీగానే గుర్తించిన బాలీవుడ్ కు ‘బాహుబలి’ సిరీస్, ‘ఆర్.ఆర్.ఆర్‘ చిత్రాలతో పెద్ద షాకిచ్చాడు. ‘బాహుబలి’ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా 2400 కోట్లు కొల్లగొట్టింది. ఇండియన్ సినీ హిస్టరీలోనే ఇదొక రికార్డు. గతంలో హిందీ చిత్ర సీమను ‘షోలే’కి ముందు.. ‘షోలే’ తర్వాత అనేవారు. అయితే.. ఇప్పుడు బాలీవుడ్ ని ‘బాహుబలి’కి ముందు.. ‘బాహుబలి’ తర్వాత అనాల్సి వస్తోంది. అది కేవలం బాలీవుడ్ కే పరిమితం కాదు.. ఇండియాలోని ప్రతీ సినీ ఇండస్ట్రీ ‘బాహుబలి’ తర్వాత తమ ఆలోచన ధోరణులు మార్చుకుందనే చెప్పాలి.

ఇండియా మూవీస్ కి ప్రేరణ..
‘బాహుబలి’ చిత్రం టాలీవుడ్ టు బాలీవుడ్ వరకూ ఫిల్మ్ మేకర్స్ ఆలోచనా తీరును మార్చేసింది. ప్రస్తుతం సౌత్ ను