హైదరాబాద్ చరిత్రతో ప్రభాస్-హను రాఘవపూడి చిత్రం

హైదరాబాద్ సంస్థానం.. నిజాంల చరిత్ర గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా.. హైదరాబాద్ చివరి నిజాం సమయంలో రజాకార్లు.. వారు చేసిన మారణహోమం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. రజాకార్ల ఇతివృత్తంతోనే గతంలో ‘రాజన్న’.. ఇటీవల ‘రజాకార్’ అనే సినిమాలొచ్చాయి.

రజాకార్లు నేపథ్యంలో క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఓ కథను సిద్ధం చేసుకున్నాడు. తొలుత మహేష్ బాబు.. ఆ తర్వాత విజయ్ దేవరకొండ లతో ఆ సినిమాని తెరకెక్కిద్దామనే ప్రయత్నాలు చేశాడు. కానీ.. అవి కుదరలేదు. ఇప్పుడు మళ్లీ రజాకార్ల ఇతివృత్తం ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రధానంగా చర్చల్లోకి వచ్చింది. అందుకు ప్రధాన కారణం ప్రభాస్ తో హను రాఘవపూడి చేసే సినిమా.

రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ప్రభాస్-హను రాఘవపూడి సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే.. బ్యాక్ డ్రాప్ అదే సమయం అయినా.. ఈ పీరియడ్ మూవీ నేపథ్యం అంతా హైదరాబాద్ సంస్థానం చుట్టూ సాగుతుందని తెలుస్తోంది. ప్రీ-ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ లో రజాకార్ల చరిత్రతోనే ప్రభాస్ సినిమాని తెరకెక్కించబోతున్నాడట డైరెక్టర్ హను రాఘవపూడి. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విశాల్ చంద్రశేఖర్ అప్పుడే కొన్ని పాటలు కూడా రెడీ చేశాడట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రం త్వరలో ముహూర్తాన్ని జరుపుకోనుంది.

Related Posts