‘కన్నప్ప’లో బాలీవుడ్ ఖిలాడి హీరో!

మంచు విష్ణు ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో తారల పరంపర కొనసాగుతూనే ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం పలు భాషల నుంచి అగ్ర తారలు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి మోహన్ బాబు, ప్రభాస్ వంటి వారు ఈ సినిమాలో భాగస్వాములు కాగా.. మలయాళం నుంచి మోహన్ లాల్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్, తమిళం నుంచి శరత్ కుమార్ వంటి వారు ఈ మైథలాజికల్ మూవీలో నటించబోతున్నారు.

లేటెస్ట్ గా ‘కన్నప్ప’లో బాలీవుడ్ ఖిలాడి హీరో అక్షయ్ కుమార్ నటించబోతున్నట్టు కన్ఫమ్ చేసింది చిత్రబృందం. హిందీ చిత్ర సీమలో దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతున్న అక్షయ్.. తెలుగులో నటించే తొలి చిత్రమిదే అవుతుంది. గతంలో రజనీకాంత్-శంకర్ ‘రోబో 2’ కోసం విలన్ గా కనువిందు చేశాడు అక్షయ్. మరి.. ‘కన్నప్ప’లో అక్షయ్ ఏ పాత్రలో కనిపిస్తాడనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Related Posts