‘పుష్ప 2’ టీజర్.. చీరకట్టులో పుష్పరాజ్.. జాతర ఎపిసోడ్ కేక!

‘బాహుబలి 2, కె.జి.యఫ్ 2′ తర్వాత రెండు పార్టులుగా యావత్ దేశ సినీ అభిమానులను అలరించడానికి సిద్ధమవుతోన్న చిత్రం *పుష్ప 2’. అంతకుముందు స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చిన క్రెడిట్ ‘పుష్ప’ చిత్రానికే దక్కుతోంది. అలాగే.. దశాబ్దాల తెలుగు కథానాయకుల కల అయిన జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా ‘పుష్ప’తో దక్కించుకున్నాడు అల్లు అర్జున్. ఇక.. ‘ఆర్య, ఆర్య2’ వంటి చిత్రాల తర్వాత.. బన్నీ-సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ ‘ది రైజ్’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పాన్ ఇండియా లెవెల్ లో తగ్గేదే లే అంటూ కలెక్షన్ల సునామీ సృష్టించాడు పుష్పరాజ్.

ఇప్పుడు ‘పుష్ప.. ది రైజ్’కి కొనసాగింపుగా రాబోతున్న చిత్రం ‘పుష్ప.. ది రూల్’. ఈ ఏడాది స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా ఆగస్టు 15న విడుదలకు ముస్తాబవుతోన్న ‘పుష్ప 2’ నుంచి ఇప్పటికే ‘వేర్ ఈజ్ పుష్ప’ అంటూ సాగే స్పెషల్ గ్లింప్స్ రిలీజయ్యింది. ఈ గ్లింప్స్ తో ‘పుష్ప 2’ అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. ఇప్పుడు అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా ‘పుష్ప 2’ నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఆద్యంతం ఓ జాతర నేపథ్యంలో సాగే సీక్వెన్స్ కి సంబంధించిన విజువల్స్ తో ఈ టీజర్ విడుదలైంది. చీరకట్టుకుని జాతరలో చిందేయడానికి సిద్ధమైన పుష్పరాజ్.. పనిలోపనిగా విలన్ల భరతం పట్టిన విజువల్స్ కూడా ఈ టీజర్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ముఖ్యంగా.. చీరకట్టులో బన్నీ మేకోవర్, స్వాగ్ టీజర్ లో ఆకట్టుకుంటున్నాయి. ‘పుష్ప2’ కథకు సంబంధించి ఈ టీజర్ లో ఏమీ రివీల్ చేయలేదు డైరెక్టర్ సుకుమార్. అలాగే.. పుష్పకి డైలాగ్స్ కూడా లేవు. మొత్తంమీద.. టీజర్ అయితే గూస్ బంప్స్ తెప్పించిందనే చెప్పాలి.

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ మూవీకి ఆస్కార్ విజేత చంద్రబోస్ లిరిక్స్ అందిస్తున్నాడు. మిరోస్లా క్యూబా బ్రోజెక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు.

Related Posts