69వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటుతున్న తెలుగు సినిమా

69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైనంది. చరిత్రలోనే మొదటిసారిగా తెలుగు సినిమా నేషనల్ అవార్డ్స్ లో ఏకపక్షంగా ఆధిపత్యం చూపించింది.

ఏకంగా 11 అవార్డులు గెలుచుకుంది. వీటిలో ఆర్ఆర్ఆర్ కు ఎక్కువ అవార్డులు ఉన్నాయి. అయితే ఇది ఊహించిందే. తెలుగు సినిమా ఒక నేషనల్ అవార్డ్స్ లో ఇన్ని అవార్డ్ లు గెలుచుకోవడం అంటే అందరూ గర్వించాల్సిన విషయంగా చెప్పాలి. పైగా ఇవేవీ మానిప్యులేటెడ్ అవార్డ్స్ లా కనిపించడం లేదు. అచ్చంగా అందరూ జెన్యూన్ గానే ఎంపికయ్యారు అని ప్రతి ఒక్కరూ భావించేలా ఉన్నాయి.

తెలుగు సినిమా పుట్టిన వందేళ్ల తర్వాత జాతీయ స్థాయిలో సగర్వంగా తలెత్తుకుని చూస్తోన్న తరుణం ఇది. మరి ఈ జాతీయ అవార్డుల్లో తెలుగు నుంచి ఏ సినిమాలు, ఏ నటులు, ఏ టెక్నీషియన్స్ అవార్డులు గెలుచుకున్నారు అనేది చూద్దాం..

జాతీయ ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప ది రైజ్)
జాతీయ ప్రాంతీయ ఉత్తమ చిత్రం – ఉప్పెన
ఉత్తమ సంగీత దర్శకుడు – దేవీ శ్రీ ప్రసాద్ ( పుష్ప ది రైజ్)
ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు – ఎమ్ఎమ్ కీరవాణి (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ గేయ రచయిత – చంద్రబోస్ (కొండపొలం నుంచి దాహం దాహం పాటకు)
ఉత్తమ గాయకుడు – కాలభైరవ (ఆర్ఆర్ఆర్ – కొమురం భీముడో)
ఉత్తమ కొరియోగ్రఫీ – ప్రేమ్ రక్షిత్( ఆర్ఆర్ఆర్ – నాటు నాటు)
బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ – కింగ్ సోలోమన్ (ఆర్ఆర్ఆర్)
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ – వి శ్రీనివాస మోహన్ (ఆర్ఆర్ఆర్)
బెస్ట్ పాపులర్ ఫిల్మ్ – ఆర్ఆర్ఆర్( డివివి దానయ్య – రాజమౌళి)
బెస్ట్ క్రిటిక్ – పురుషోత్తమ చార్యులు

ఇలా మొత్తం 11 అవార్డులను 12 మంచి పంచుకోబోతున్నారు. ఓ రకంగా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా చెప్పాలి.ఈ విజయ యాత్ర మున్ముందు మరింత గొప్పగా సాగాలని కోరుకుంటూ విజేతలందరికీ తెలుగు 70ఎమ్ఎమ్ శుభాకాంక్షలు చెబుతోంది.

Related Posts