ఫస్ట్ సింగిల్స్ తో వస్తోన్న సంక్రాంతి సినిమాలు

సంక్రాంతి సినిమాల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో రాబోతున్న ‘గుంటూరు కారం‘ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజయ్యింది. ఇప్పుడు మరో రెండు చిత్రాలు ‘సైంధవ్, హనుమాన్‘ నుంచి మొదటి పాటలు రాబోతున్నాయి. అందుకు సంబంధించిన అనౌన్స్ మెంట్స్ ను దీపావళి కానుకగా అందించారు మేకర్స్.

వెంకటేష్ కెరీర్ లో 75వ సినిమాగా ‘సైంధవ్‘ రాబోతుంది. ‘హిట్‘ సిరీస్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ‘సైంధవ్‘ మూవీ నుంచి ‘రాంగ్ యుసేజ్‘ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ నవంబర్ 21న రాబోతుంది. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

సంక్రాంతి బరిలో పేరుకు చిన్న సినిమాయే అయినా.. పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తూ వస్తోన్న చిత్రం ‘హను మాన్‘. చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న తేజ సజ్జా హీరోగా నటిస్తున్న సినిమా ఇది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ ఇండియన్ సూపర్ హీరో మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకానుంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను నవంబర్ 14న సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకి విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

సంక్రాంతి బరిలో రాబోతున్న మరో రెండు చిత్రాలు ‘ఈగల్, ఫ్యామిలీ స్టార్‘ మూవీస్ కి సంబంధించిన ఫస్ట్ లుక్స్ కూడా త్వరలోనే రానున్నాయి. ఇక.. దీపావళి స్పెషల్ గా ఈ రెండు సినిమాల నుంచి రెండు స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

‘ఈగల్‘ పోస్టర్ లో రవితేజ మాసీగా గన్ పట్టుకుని ఈగల్ తరహా లుక్ లో కనిపిస్తున్నాడు. ‘ఫ్యామిలీ స్టార్‘ పోస్టర్ లో హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ దివాళి సెలబ్రేషన్స్ తో ఫ్యామిలీ వైబ్స్ తీసుకొచ్చారు.

Related Posts