HomeMoviesసంక్రాంతి సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీలో వచ్చేస్తున్నాయి!

సంక్రాంతి సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీలో వచ్చేస్తున్నాయి!

-

సంక్రాంతి బరిలో విడుదలైన నాలుగు చిత్రాలలో లేటెస్ట్ గా ‘సైంధవ్’ ఓటీటీలో స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. ఫిబ్రవరి 3 నుంచి ‘సైంధవ్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంటుంది. వెంకటేష్ కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం కూడా మరో వారంలో స్ట్రీమింగ్ కి రెడీ కానుందట. ‘సలార్’ తరహాలోనే ఈ సినిమాని 28 రోజుల్లోనే స్ట్రీమింగ్ కి రెడీ చేయడానికి నెట్ ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తుందట. ఆ లెక్కన చూసుకుంటే ఫిబ్రవరి 9 నుంచే సైలెంట్ గా ‘గుంటూరు కారం’ స్ట్రీమింగ్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.

సంక్రాంతి బరిలో మంచి విజయాన్నందుకున్న కింగ్ నాగార్జున ‘నా సామిరంగ’ ఫిబ్రవరి 15 నుంచి స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉంది. నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషిక రంగనాథ్ వంటి తారాగణంతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్ట్ చేసిన ఈ మూవీ చాలా తక్కువ సమయంలో షూటింగ్ పూర్తిచేసుకుని థియేటర్లలోకి వచ్చింది. ‘నా సామిరంగ’ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ సంక్రాంతికి అసలు సిసలు బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘హనుమాన్’ మాత్రం మార్చి నుంచే స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ముందుగా ఈ చిత్రాన్ని నెల రోజుల్లోపే ఓటీటీలో వదలాలనే ఆలోచన ఉందట. కానీ.. అఖండ విజయాన్ని సాధించిన ఈ మూవీని మార్చి మూడో వారం నుంచి స్ట్రీమింగ్ కి సిద్ధం చేయాలని భావిస్తోందట ఓటీటీ సంస్థ జీ5.

ఇవీ చదవండి

English News