శింబు కోసం కమల్ బర్త్ డే గిఫ్ట్

విశ్వ నటుడు కమల్ హాసన్ ఒకవైపు హీరోగా తన సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు నిర్మాతగానూ దూకుడు పెంచుతున్నాడు. ఈకోవలోనే విలక్షణ నటుడు శింబుతో కమల్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈరోజు (ఫిబ్రవరి 3) శింబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను లాంఛ్ చేశాడు కమల్ హాసన్.

STR-48 వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ మూవీ పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఇంప్రెస్సివ్ గా ఉంది. ఈ పోస్టర్ లో డ్యుయల్ రోల్ లో అదరగొడుతున్నాడు శిలంబరసన్. ఈ సినిమాలో హీరోగా, విలన్ గా రెండు పాత్రల్లోనూ శింబు కనిపించబోతున్నట్టు అర్థమవుతుంది. దేశింగు పెరియస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది.

Related Posts